Discount Offer on Cars: దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కానుంది. మార్కెట్లు ఇప్పటికే ఆఫర్లు (Discount Offer on Cars) ప్రారంభించాయి. ఆటో రంగానికి ఈసారి చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా వాహనాల స్టాక్ క్లియర్ కాలేదు. దీని కారణంగా డిస్కౌంట్ల ట్రెండ్ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు పండుగల సీజన్ మొదలవుతోంది. కాబట్టి కార్ల కంపెనీలు కస్టమర్ల కోసం చాలా మంచి ఆఫర్లు, డిస్కౌంట్లను తీసుకొచ్చాయి. ఈ నెల (సెప్టెంబర్), ఫోక్స్‌వ్యాగన్ నుండి హ్యుందాయ్ వరకు కార్లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి. వీటిని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ కారు ఎంత డిస్కౌంట్ ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వోక్స్‌వ్యాగన్
ఈ నెలలో వోక్స్‌వ్యాగన్ సెడాన్ కారు Virtus కొనుగోలు చేయబోతున్న వారికి రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు ఈ నెలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి కస్టమర్లు ఈ ఆఫర్‌ను త్వరగా సద్వినియోగం చేసుకోవచ్చు. Virtus ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 1.0- 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఇది రోజువారీ డ్రైవింగ్‌ను మెరుగుపరచడానికి అవసరమైన అన్ని లక్షణాలను కలిగి ఉంది.
హోండా సిటీ
హోండా సిటీ ఇప్పటికీ దాని విభాగంలో అత్యుత్తమ సెడాన్ కారుగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ఈ కారుపై రూ.1.14 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ కారులో 1.5L పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో చాలా మంచి ఫీచర్లను కూడా పొందుతారు.
హోండా అమేజ్
కాంపాక్ట్ సెడాన్ కార్ సెగ్మెంట్లో హోండా అమేజ్ బాగుంటుంది. ఈ నెలలో ఈ కారును కొనుగోలు చేయడం ద్వారా రూ. 1.12 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఇంజన్ గురించి చెప్పాలంటే.. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్‌తో జత చేయబడింది.
Also Read: J-K: జమ్మూలో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా మిడ్-సైజ్ సెడాన్ ఆర్ సెగ్మెంట్లో గొప్ప కారుగా పేరుగాంచింది. ఈ నెల ఈ కారుపై మొత్తం రూ. 50,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. వెర్నా ప్రస్తుతం దాని సెగ్మెంట్‌లో స్టైలిష్, ఫ్యూచరిస్టిక్‌గా డిజైన్ చేసిన కారు.
హ్యుందాయ్ ఆరా
కాంపాక్ట్ సెడాన్ కార్ల జాబితాలో హ్యుందాయ్ ఆరాను యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నెలలో ఈ కారుపై రూ.48,000 వరకు ఆదా చేసుకునే అవకాశాన్ని పొందుతారు. ఈ కారు హోండా అమేజ్, మారుతి డిజైర్ వంటి వాహనాలతో నేరుగా పోటీపడుతుంది. ఈ ఆఫర్‌లన్నింటి గురించి మరింత సమాచారం కోసం కార్ డీలర్‌షిప్‌ను సంప్రదించండి.