ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల కార్లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో బడ్జెట్ కార్ల నుంచి హై రేంజ్ కార్ల వరకు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రోజురోజుకీ కార్ల మార్కెట్ విపరీతంగా విపిస్తరిస్తోంది. ఈ మధ్యకాలంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు కూడా బడ్జెట్ ధరలోని కార్లను కొనుగోలు చేస్తుండడంతో అందుకు అనుగుణంగానే సామాన్యుల నుంచి ధనికుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా రకరకాల కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. సరికొత్త ఫీచర్లు, ప్రత్యేకతలు, స్లైలిష్ లుక్ తో విడుదల అయ్యి ఆకట్టుకుంటున్నాయి. నెలలో పదుల సంఖ్యలో కార్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఇటాలియన్ కార్ల తయారీ సంస్థ అయిన లంబోర్ఘిని నుంచి సరికొత్త సూపర్ స్టైలిష్ కారు విడుదలైంది. లగ్జరీ కార్లు, ఎస్‌యూవీ లను తయారు చేయడంతో ఈ కంపెనీకి ఎంతో పేరుంది. ఇకపోతే తాజాగా లంబోర్ఘిని నుంచి విడుదలైన టెమెరారియో స్పోర్ట్స్ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.. లంబోర్ఘిని నుంచి మొదటి ఎలక్ట్రిక్ వాహనం విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ లంబోర్ఘిని మాత్రం అందుకు పూర్తిగా సిద్ధమవ్వలేదు. దాంతో ఈవీకి బదులుగా కొత్త హైబ్రిడ్ కారు టెమెరారియోను మార్కెట్ లోకి విడుదల చేసింది. మాంటెరీ కార్ వీక్ ఈవెంట్ లో కొత్త కారును ప్రదర్శించింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితమే ఈ కారును అభివృద్ధి చేయడాన్ని కంపెనీ ప్రారంభించింది.
తన అవుట్ గోయింగ్ వీ10 సూపర్ స్పోర్ట్స్ కారైన హురాకాన్ స్థానంలో టెమెరారియోను తీసుకువచ్చింది. కాగా ఈ టెమెరారియో కారులో సంప్రదాయ వీ10 ఇంజిన్ కు బదులు ట్విన్ టర్బో చార్జ్ 4.0 లీటర్ వీ8 ఇంజిన్ ఏర్పాటు చేశారు. ఇది 10.000 ఆర్పీఎమ్ కు చేరుకుంటుందని, అత్యధిక రివీవింగ్ ఇంజిన్ అని కంపెనీ పేర్కొంది. ఈ వీ8 మాత్రమే 9000 ఆర్ఫీఎం 9,750 ఆర్ఫీఎం మధ్య 800 హెచ్ పీని ఉత్పత్తి చేస్తుందని వెల్లడించింది. అలాగే వీ8 ఇంజిన్ కు అనుబంధంగా మూడు ఎలక్ట్రిక్ మోటారు అమర్చారు. వీటి నుంచి మరో 295 బీహెచ్పీ విడుదల అవుతుంది. ఈ హైబ్రిడ్ సెటప్ పెట్రోల్ ఇంజిన్ తో కలిపి 920 హెచ్ పీ, 800 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
ఇంజిన్ సామర్థ్యాన్ని పెంచడమే హైబ్రిడ్ పవర్ ట్రైయిన్ ప్రధాన ఉద్ధేశం. ఇకపోతే ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే.. టెమెరారియో కారు కేవలం 2.7 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. గరిష్టంగా 340 కేఎంపీఎల్ స్పీడ్ తో పరుగులు పెడుతుంది. టెమెరారియోతో ఏరోడైనమిక్ సామర్థ్యం పరంగా లంబోర్ఘిని మెరుగుదల సాధించింది. అత్యాధునికమైన హైస్ట్రెంగ్త్, అల్ట్రా లైట్ అల్లాయ్ ని ఉపయోగించడం వల్ల టోర్షనల్ దృఢత్వాన్ని గణనీయంగా పెరుగుతుంది. సులభమైన డ్రైవింగ్ కు దోహదపడుతుంది. ముఖ్యంగా టెమెరారియో అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ఈ కారు 2025 ద్వితీయార్థంలో విక్రయానికి అందుబాటులోకీ రానుంది. ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు కానీ హురాకాన్ కంటే ఖరీదు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.