భారతదేశం వాహనాల అమ్మకాల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో కూడా భారతదేశం ఒకటి. ఇక్కడ కార్లను అలాగే స్కూటర్లను రాజకీయ పారిశ్రామిక, రంగాలతో పాటు వివిధ రంగాల వారు కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. సామాన్యుడి నుంచి పెద్దపెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ కార్లను బైకులను తప్పనిసరిగా వినియోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల, బైకుల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే మన దేశంలో కార్ల వినియోగంతో పోల్చుకుంటే స్కూటర్ల వినియోగమే ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్ లో టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది.
దాని వెనుక హ్యుందాయ్, మహీంద్రా, కియా, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఉన్నాయి. దేశంలో 2030 నాటికి ఈవీల శాతం 30కి పెరగాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే ఇది కొంచె కష్టమే అయినప్పటికీ ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే కార్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో వాటిని కొనుగోలు చేయడం కష్టం. దీంతో చాలామంది ద్విచక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత చౌకయిన ఎలక్ట్రిక్ కారు ఎంపీ కామెట్. దీని ధర రూ.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
ఇది కూడా పరిమిత పరిధి కలిగి, నగరాల్లో తిరగడానికి వీలుగా ఉండే కారు. ఆ తర్వాత టాటా టియాగో రూ.8 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీన్ని ఒక్కసారి చార్జింగ్ చేస్తే కేవలం 300 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే వస్తుంది. దేశంలోని వెయ్యి మందిలో కేవలం 26 మంది మాత్రమే కార్లను వినియోగిస్తున్నారు. మిగిలిన వారికి ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ రవాణా సాధనాలే శరణ్యం అని చెప్పాలి. అదే విధంగా ఎలక్ట్రిక్ కార్లన్నీ పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మేజర్ పంచాయతీలలో పాటు గ్రామాల స్థాయికి పూర్తిస్థాయిలో చేరలేదనే చెప్పాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ చాలా కీలకం. ఆధునిక టెక్నాలజీతో బ్యాటరీ సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో దాని ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. అలాగే మారుతీ సుజుకీ తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ వీ విటారాను జనవరిలో జరిగే మొబిలిటీ ఎక్స్ పోలో విడుదల చేయడానికి సిద్దమైంది. మహీంద్రా నుంచి బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ, హ్యుందాయ్ నుంచి క్రెటా ఈవీ కూడా మార్కెట్ లోకి రానున్నాయి. మరికొన్ని లగ్జరీ కార్ల బ్రాండ్ల నుంచి వాహనాలు విడుదల కానున్నాయని సమాచారం. అలాగే పబ్లిక్ చార్జింగ్ పాయింట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బ్యాటరీ టెక్ డెవలప్మెంట్ కూడా మెరుగుపడుతోంది.