KTM 200 Duke: 2023 కేటీఎం 200 డ్యూక్ బైక్ లో కొత్త ఫీచర్లు.. అవి ఇవే..!

కేటీఎం 200 డ్యూక్‌ (KTM 200 Duke)ని LED హెడ్‌ల్యాంప్‌తో అప్‌గ్రేడ్ చేసింది. దీని ధర రూ.1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 01:39 PM IST

KTM 200 Duke: కేటీఎం 200 డ్యూక్‌ (KTM 200 Duke)ని LED హెడ్‌ల్యాంప్‌తో అప్‌గ్రేడ్ చేసింది. దీని ధర రూ.1.96 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 200 డ్యూక్ భారతదేశంలో కేటీఎం మొదటి ఉత్పత్తి. ఇక్కడ మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న KTM మోడల్ కూడా ఇదే. ఈ బైక్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. మీరు దానిలో మునుపటిలా చాలా ఫీచర్లని చూస్తారు. కానీ ప్రధాన మార్పు కింద దీని హెడ్‌ల్యాంప్ పూర్తిగా LEDతో చేయబడింది.

ఈ అధిక పనితీరు గల బైక్ బ్రేకింగ్ విధుల గురించి మాట్లాడుకుంటే.. మోటార్‌ సైకిల్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లతో కూడిన డ్యూయల్-ఛానల్ ABS, USF ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మరిన్నింటిని జోడించడం జరిగింది. అప్‌డేట్ చేయబడిన ఈ బైక్ 2023 KTM 200 డ్యూక్ రెండు రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ సిల్వర్ మెటాలిక్ లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Rs 10 Frooti Vs 8 Crores Robbery : రూ.10 ఫ్రూటీతో ఎర.. 8 కోట్లు దొంగిలించిన కపుల్ అరెస్ట్

ఇంజన్ ఎలా ఉంది..?

2023 కేటీఎం 200 డ్యూక్ ఇంజిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 24bhp, 19.2Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యాషింగ్ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లింక్ చేయబడింది. 200 డ్యూక్‌లో క్విక్ షిఫ్టర్ ఎంపిక అందుబాటులో లేదు. అయితే ఈ సదుపాయం KTM 390లో ఇవ్వబడింది.

కంపెనీ ప్రకటన

లాంచ్‌పై బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ.. LED హెడ్‌ల్యాంప్ అప్‌గ్రేడ్ మోటార్‌సైకిల్‌ను మునుపటి కంటే పదునుగా, ప్రీమియంగా మారుస్తుందని అన్నారు. ఈ అప్‌గ్రేడ్‌తో కేటీఎం 200 డ్యూక్ భారతదేశంలో మొదటిసారి ప్రారంభించబడినప్పుడు పనితీరు బైకింగ్ విభాగంలో ప్రారంభమైన విప్లవాన్ని మేము కొనసాగిస్తున్నామన్నారు.