Kia: మార్కెట్లోకి సరికొత్త కియా ఎలక్ట్రిక్ కార్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తోడు ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో వాసన వినియోగదారు

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 07:30 PM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దానికి తోడు ఇంధన ధరలు పెరిగిపోతుండడంతో వాసన వినియోగదారులు ఎక్కువ శాతం ఎలక్ట్రిక్ వాహనాల వైఫై మగ్గుచూపుతున్నారు. దీంతో ఆయా సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు కొత్త కొత్త ఫీచర్ లతో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయినా కియా కొత్త ఎలక్ట్రిక్‌ కార్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది.

ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన కియా సంస్థ మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఎలక్ట్రిక్‌ కార్ల విభాగాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ9 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కాగా ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో ఈవీ6 ఎస్‌యూవీని 2021లో విడుదల చేసిన కియా కంపెనీకి ఇది రెండో ఎలక్ట్రిక్‌ కార్‌. మూడు వరుసల సీటర్ అయిన ఈ ఎస్‌యూవీ 99.8 కిలోవాట్-హవర్‌ బ్యాటరీతో వస్తుంది.

ఒక్కసారి ఛార్జింగ్‌తో 501 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఇందులో ఆల్-వీల్-డ్రైవ్ మోడల్ కూడా అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా దక్షిణ కొరియాలో సోమవారం అనగా జూన్‌ 19 విడుదల చేసింది. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈవీ9 ఎస్‌యూవీ ధర 73 నుంచి 82 మిలియన్ వాన్‌లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.46.8 నుంచి రూ. 52.5 లక్షలుగా ఉంటుంది. తర్వాత విడతలో ఈ ఎస్‌యూవీని యూరప్, యునైటెడ్ స్టేట్, ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కియా కంపెనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.