Site icon HashtagU Telugu

Maruti Rolls Royce : మారుతీ 800ను రోల్స్ రాయిస్ గా మార్చేశాడు

Maruti Rolls Royce

Maruti Rolls Royce

Maruti Rolls Royce : కేరళకు చెందిన యువకుడు హదీఫ్ మారుతీ 800 కారును రోల్స్ రాయిస్ కారుగా మార్చేశాడు. మిడిల్ క్లాస్ ప్రజల కారుగా పేరొందిన మారుతీ 800కు రోల్స్ రాయిస్ లుక్ వచ్చేలా చేశాడు. రోల్స్ రాయిస్ కారును కొనాలని అతడికి ఉండేది. ఆ కోరికను తీర్చుకునేందుకు 18 ఏళ్ల హదీఫ్ క్రియేటివ్ గా ఆలోచించాడు.  ఆటోమొబైల్ వర్క్ పై తనకున్న నాలెడ్జ్ తో ఒక ప్రయత్నం చేశాడు. రూ.45 వేల ఖర్చుతో మారుతీ 800 కారును రోల్స్ రాయిస్ లా మార్చేశాడు. ఇందుకోసం అతడు పాత రోల్స్ రాయిస్ కార్ల విడిభాగాలను సేకరించి.. తన మారుతీకి కొత్త హంగులు అద్దాడు. మొత్తం సెటప్ ను  మార్చేశాడు. బాడీ హెడ్ లైట్ల నుంచి మొత్తం కారు బాడీ దాకా  రోల్స్ రాయిస్ లా కనిపించేలా  చేశాడు.

Also read : NTPC Coal Growth: బొగ్గు ఉత్పత్తిలో NTPC రికార్డు

ఇందుకోసం హదీఫ్ కొన్ని నెలల పాటు కష్టపడ్డాడు. ఇప్పుడు అతడు ఈ  కారులో దర్జాగా చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైపుణ్యం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించిన  హదీఫ్ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలో ఇలాగే ఓ ఔత్సాహిక కార్పెంటర్ టాటా నానో కారును హెలికాప్టర్  గా మార్చేశాడు. హెలికాప్టర్ నడపాలనే తన కలను (Maruti Rolls Royce) నెరవేర్చుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join