Car Care Tips: మీకు కారు ఉందా.. అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో కనీసం ఆరుగురు కార్లను వినియోగిస్తున్నారు. కొందరు అవసరం లేకపోయినప్పటికీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.కా

  • Written By:
  • Updated On - February 16, 2024 / 04:56 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో కనీసం ఆరుగురు కార్లను వినియోగిస్తున్నారు. కొందరు అవసరం లేకపోయినప్పటికీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.కారు ఉంటే తన హోదా పెరిగినట్లు భావించి కొనేవారు కూడా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అయితే కారు కొనేముందు దాని గురించి అవగాహన ఉండటం తప్పనిసరి. లేకుంటే కారుకు చిన్నపాటి సమస్య వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వాహనం కారు. ఆఫీసు రాకపోకలు, ప్రయాణాలతో సహా అనేక ప్రయోజనాల కోసం కార్లు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు.

అయితే కారులో ప్రయాణం ప్రారంభించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కూడా మీరు కారును స్టార్ట్ చేసే ముందు కారులోని ఇంజిన్ ఆయిల్ లెవెల్‌ను తనిఖీ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీరు పెద్ద సమస్యలను సులభంగా నివారించవచ్చు. ఆయిల్‌ తనిఖీ చేయడానికి ఇంజిన్‌లో అమర్చిన డిప్‌స్టిక్‌ను తీయడం ద్వారా దాని పరిమాణాన్ని తనిఖీ చేయవచ్చు. అవసరమైతే ఆయిల్‌ మార్చాలి. ఇంజన్ ఆయిల్ తో పాటు కూలెంట్, బ్యాటరీ, బ్రేక్ ఆయిల్ వంటి ముఖ్యమైనవి కూడా కారులో చెక్ చేసుకోవాలి.

కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీంతో ఇబ్బందులు ఎదురైతే ప్రయాణం మధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ప్రతి వాహనానికి టైర్లు చాలా ముఖ్యం. వాటి పనితీరును కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. టైర్లు తక్కువ గాలితో లేదా పంక్చర్ అయినట్లయితే ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే ప్రయాణం ప్రారంభించే ముందు టైర్లను చెక్ చేసుకోవడం మంచిది. మీరు కారును స్టార్ట్ చేసిన ప్రతిసారీ కొన్ని ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కారు స్టార్ట్ అయిన వెంటనే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కొన్ని లైట్లు వెలుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ప్రయాణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. క్లస్టర్ లైట్లు క్లుప్తంగా వెలుగుతాయి. తర్వాత వాటంతట అవే ఆఫ్ అవుతాయి. కానీ ఏదైనా చెక్ లైట్ నిరంతరం ఆన్‌లో ఉంటే లేదా ఆన్, ఆఫ్‌లో ఉంటే, అప్పుడు కారును మెకానిక్‌తో తనిఖీ చేయించాలి.