ఇండియాలో కవాసాకి బైక్ కు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో ఈ కవాసాకి బైక్స్ కూడా ఒకటి. కానీ ఈ బైక్ ధర విషయంలోనే చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఇక అలాంటివారి కోసం ఎప్పటికప్పుడు అదిరి పోయా డిస్కౌంట్లను అందిస్తూ కొనుగోలుదారుల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తోంది కవాసాకి. ఇది ఇలా ఉంటే తాజాగా వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కవాసాకి నింజా 650 పై భారీగా డిస్కౌంట్ ను అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
కాగా హై పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిళ్లలో అత్యంత ఇష్టమైన బ్రాండ్లలో కవాసాకి కూడా ఒకటి కవాసాకి తన మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్ లను ప్రకటించిన ప్రతీ సారి భారీగా విక్రయాలు జరుగుతున్నాయి. కాగా ఇప్పటికే 2024 మార్చిలో కవాసాకి నాలుగు మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్లను అందించిన విషయం తెలిసిందే. ఇందులో నింజా 400పై రూ.40,000, నింజా 650పై రూ.30,000, వెర్సిస్ 650పై రూ.40,000, వల్కన్ ఎస్ పై రూ.60,000 తగ్గింపు ఉంది. ఇకపోతే తాజాగా కవాసాకి జూలై 2024లో నింజా 650పై రూ .30,000 తగ్గింపును అందిస్తోంది. గుడ్ టైమ్స్ వోచర్స్ రూపంలో ఈ డిస్కౌంట్ అందిస్తోంది. అయితే దీనిని కొనుగోలుదారులు చెక్ అవుట్ వద్ద రీడీమ్ చేసుకోవచ్చు.
కంపెనీ కూడా తన మిడిల్ వెయిట్ ఆఫర్ నింజా 650పై రూ .30,000 తగ్గింపును సోషల్ మీడియాలో ప్రకటించింది. మరి ఆ ఆఫర్ల వివరాల్లోకి వెళితే.. కవాసాకి నింజా 650 ఎక్స్ షోరూమ్ ధర రూ.7.16 లక్షలుగా ఉంది. కొనుగోలుదారులు ఈ మోటార్ సైకిల్ పై రూ. 30,000 విలువైన గుడ్ టైమ్ వోచర్ ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ తర్వాత ఈ బైక్ ధర రూ .6.86 లక్షలుగా ఉంది. అయితే ఈ ఆఫర్ ఈ స్టాక్ అయిపోయే వరకు మాత్రమే ఉంటుందట. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ బైక్ ని కొనుగోలు చేసి 30 వేల వరకు ఆదా చేసుకోండి.