Kawasaki Eliminator: వినియోగదారులను భయపెట్టిస్తున్న కవాసాకి సరికొత్త బైక్.. ధర ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?

కవాసాకి వాహనాలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ వినియోగదారులు ఈ బ్రాండ్ వాహనాలను ఎక్

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 03:00 PM IST

కవాసాకి వాహనాలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ వినియోగదారులు ఈ బ్రాండ్ వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇటీవలే భారత మార్కెట్లోకి ఎలిమినేటర్ బైక్ లాంచ్ చేసింది కవాసాకి. ఈ బైక్ ధర తెలిసి వినియోగదారులు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఈ బైక్ కొనే ధరతో ఒక చిన్న సైజ్ కారు కొనవచ్చు. భారతదేశ మార్కెట్‌లో 5.62 లక్షలకు లాంచ్ అయిన ఈ నియో రెట్రో క్రూయిజర్ బైక్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయాయి. త్వరలో డెలివరీ కూడా మొదలు కానుంది. ఇండియాలో పూర్తి స్థాయిలో ఇంపోర్టెడ్ బైక్ లాంచ్ అయింది.

కవాసాకి ఎలిమినేటర్ లాంచ్ ఇప్పుడు బైక్ మార్కెట్‌లో ఒక సంచలనం సృష్టించనుంది. ఇప్పటికే ఈ నియో రెట్రో క్రూయిజర్ బుకింగ్స్ ప్రారంభం కాగా త్వరలో బైక్ డెలివరీ కూడా జరగనుంది. అయితే ఈ బైక్ ఉన్నారా లక్షల్లో ఉన్నప్పటికీ వినియోగదారులు మాత్రం వెనకడుగు వేయడం లేదు. కానీ కొంతమంది మాత్రం అదే డబ్బుతో కారు కొనుగోలు చేయవచ్చు కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ బైక్ ఇంపోర్టెడ్ కావడంతో ధర ఎక్కువే ఉంది. ఏకంగా 5.62 లక్షల రూపాయలకు లాంచ్ చేసింది కంపెనీ. ఈ బైక్ సింగిల్ పెంట్ స్కీమ్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. కవాసాకి ఎలిమినేటర్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 కంటే అధికమైన ప్రీమియర్ ఆప్షన్‌గా చూడవచ్చు.

గత ఏడాది మార్చ్‌లో ఈ బైక్ ప్రపంచమార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. కవాసాకి ఎలిమినేటర్‌లో రౌండ్ హెడ్ ల్యాంప్స్, నాజూకైన ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్ ఎడ్జస్ట్ మఫ్లర్, ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇందులో 735 మిల్లీమీటర్ సీట్ హైట్ ఉంటుంది. పొడుగైన హ్యాండిల్ బార్, సెంటర్ సెట్ ఫుట్ పెగ్‌తో అద్భుతమైన రైడింగ్ పోశ్చర్ అనుభూతి కలుగుతుంది. స్లిప్ట్ సీట్ సెటప్‌తో వస్తోంది. బైక్ ఇంజన్ కెన్సింగ్, ఎల్లాయ్ వీల్స్, ఎక్స్‌పోజ్డ్ ఫ్రేమ్ సహా చాలా భాగాలు బ్లాక్డ్ అవుట్ అయి ఉంటాయి. కవాసాకి ఎలిమినేటర్‌లో 451 సిసి ఇంజన్, లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజన్ ఉంటాయి. ఈ ఇంజన్ 44 బీహెచ్‌పి పవర్, 42.6 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఈ ఇంజన్‌ను స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ద్వారా 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానించారు. ఎలిమినేటర్‌ను స్టీల్ ట్రేలిస్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా క్రూయిజర్ కోసం తయారైంది. ఈ ఫ్రేమ్‌కు ముందు 41 మిల్లీమీటర్ల టెలీస్కోపిక్ ఫోక్స్ , డ్యూయల్ రేర్ షాక్ అబ్జర్వర్‌తో వస్తుంది. క్రూయిజర్‌లో 18 ఇంచెస్ ఫ్రంట్, 16 ఇంచెస్ రేర్ ఎల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం 310 మిల్లీమీటర్ ఫ్రంట్, 240 మిల్లీమీటర్ రేర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇవి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో మిళితమై ఉన్నాయి. ఎలిమినేటర్ వెర్షన్ 176 కిలోలుంటుంది.ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 150 మిల్లీమీటర్లుగా ఉంది. ఎలిమినేటర్‌లో ఆల్ ఎల్ఈడీ లైట్స్ ఫుల్ డిజిటల్ ఎల్సీడీ మరో ఆకర్ణణ. కవాసాకి ఎలిమినేటర్ భారతీయ రోడ్లపై అందుబాటులో వచ్చాక ఈ బైక్ కచ్చితంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కాగలదు.