Site icon HashtagU Telugu

Kawasaki W175: బంపర్ ఆఫర్.. కవాసకి బైక్ పై భారీ డిస్కౌంట్?

Mixcollage 14 Dec 2023 02 17 Pm 3953

Mixcollage 14 Dec 2023 02 17 Pm 3953

జపనీస్ బైక్ మేకర్ కవాసకి ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల వాహనాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో స్టైలిష్ లుక్ లో ఉండే వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది కవాసకి. కాగా గత ఏడాది మార్కెట్లోకి విడుదల అయిన కవాసకి W175 మోడల్, కస్టమర్ లను పెద్దగా ఆకట్టుకోలేదు. రూ.1.47 లక్షల బేస్ ధరతో, కంపెనీ లైనప్‌లో చీపెస్ట్ మోటార్‌ సైకిల్‌గా ఇది నిలిచింది. అయితే మిక్స్‌డ్ రెస్పాన్స్ కారణంగా కంపెనీ ఈ బైక్ ధరను భారీగా తగ్గించింది.
కవాసకి W175 మోటార్‌ సైకిల్ ధరను కంపెనీ ఏకంగా రూ. 25,000 తగ్గించింది.

దీని ధర ఇప్పుడు రూ.1.22 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే కలర్ వేరియంట్‌ను బట్టి రూ.1.31 లక్షల వరకు ఉంటుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. కవాసకి కంపెనీ W175 లైనప్‌లో మరో కొత్త ఎడిషన్‌ను రిలీజ్ చేసింది. గతవారం జరిగిన ఇండియా బైక్ వీక్ 2023లో W175 స్ట్రీట్ అనే కొత్త వేరియంట్‌ను ఈ బ్రాండ్ పరిచయం చేసింది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. కాగా దీని ధర రూ.1.35 లక్షలుగా ఉంది. కవాసకి W175 స్ట్రీట్ ధర రూ.1.35 లక్షలుగా ఉంది. తాజా ఆఫర్ తర్వాత ఓల్డ్ మోడల్స్ ధరలు భారీగా తగ్గాయి. ఇప్పుడు కవాసకి W175 మెటాలిక్ ఓషన్ బ్లూ మోడల్ ధర రూ.1.31 లక్షలకు తగ్గింది. ఈ మోటార్‌సైకిల్ మెటాలిక్ గ్రాఫైట్ గ్రే కలర్ వేరియంట్ ధర రూ. 1.29 లక్షలు కాగా, కాండీ పెర్సిమోన్ రెడ్ వేరియంట్ రూ. 1.24 లక్షలుగా ఉంది.

ఇకపోతే కవాసకి W175 ప్రత్యేకతల విషయానికి వస్తే… కవాసకి W175 బైక్ 177 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ మోటార్ 13 hp పవర్‌ను, 13.2 Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయ్యి ఉంటుంది. ఈ మోటార్‌ సైకిల్ డిఫరెంట్ కలర్ స్కీమ్స్, అల్లాయ్ వీల్స్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తుంది. హాలోజన్ హెడ్‌ల్యాంప్, సింగిల్-ఛానల్ ABSతో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, చిన్న LCD డిస్‌ప్లేతో కూడిన రెట్రో స్పీడోమీటర్, పీ షూటర్ ఎగ్జాస్ట్, వంటి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఇది మోడర్న్, అడ్వాన్స్‌డ్ బైక్‌గా నిలవలేదు. ఇప్పటికే ఇతర కంపెనీల ప్రీమియం బైక్స్‌లో వచ్చిన కాంపోనెంట్స్‌ దీంట్లో ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో W175 పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ప్రస్తుతం కవాసకి W175 బైక్, మార్కెట్లో యమహా FZ-X మోడల్‌కు పోటీగా ఉంది. అయితే కంపెనీ తాజా నిర్ణయంతో W175 అన్ని వేరియంట్లు ఇప్పుడు యమహా FZ-X ధర రూ.1.36 లక్షల కంటే తగ్గింది.