Jeep Discount: కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep Discount) తన కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన సమ్మర్ ఆఫర్లను ప్రకటించింది. ఈ జూన్ 2025లో జీప్ కంపాస్, గ్రాండ్ చెరోకీ, మెరిడియన్ మోడళ్లపై గరిష్టంగా రూ. 3.90 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. విక్రయాలను పెంచడానికి, పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ ఈ భారీ డిస్కౌంట్లను ఉపయోగిస్తోంది. జీప్ అన్ని SUVలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందినవి. ఈ కార్లపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకుందాం.
జీప్ కంపాస్‌పై రూ. 2.95 లక్షల డిస్కౌంట్
ఈ నెలలో జీప్ కంపాస్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ శక్తివంతమైన SUVపై రూ. 2.95 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ వాహనం ధర రూ. 18.99 లక్షల నుంచి రూ. 32.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)తో EBD వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.
Also Read: Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
జీప్ గ్రాండ్ చెరోకీపై రూ. 3 లక్షల డిస్కౌంట్
జీప్ గ్రాండ్ చెరోకీపై ఈ నెలలో రూ. 3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ SUV టాప్-స్పెక్ లిమిటెడ్ (O) ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో 272 హార్స్‌పవర్, 400 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
జీప్ మెరిడియన్‌పై రూ. 3.90 లక్షల డిస్కౌంట్
ఈ నెలలో కంపెనీ తన అత్యంత ఖరీదైన SUV అయిన జీప్ మెరిడియన్‌పై అత్యధిక డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ వాహనంపై కస్టమర్లు రూ. 2.30 లక్షల వరకు నేరుగా డిస్కౌంట్, రూ. 1.30 లక్షల వరకు కార్పొరేట్ ఆఫర్, అదనంగా రూ. 30,000 వరకు ప్రత్యేక ప్రయోజనం పొందవచ్చు. దీంతో మొత్తం లాభం రూ. 3.90 లక్షలకు చేరుతుంది. మెరిడియన్ ధర రూ. 24.99 లక్షల నుంచి రూ. 38.79 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో 170 హార్స్‌పవర్, 350 Nm టార్క్‌ను produce చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.