Site icon HashtagU Telugu

iVOOMi S1 lite: కేవలం రూ.55 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Mixcollage 23 Jul 2024 12 37 Pm 8975

Mixcollage 23 Jul 2024 12 37 Pm 8975

ప్రస్తుతం భారతదేశంలో ఈవీ వాహనాలు ట్రెండ్ నడుస్తుండగా, అందుకు అనుకూలంగానే వాహన తయారీ సంస్థలు ఇప్పటికే అనేక రకాల ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఒకదానిని మించి ఒకటి అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఆకట్టుకుంటుండగా ఈ నేపథ్యంలోనే మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత్లో అత్యంత తక్కువ ధరకే అత్యధిక మైలేజ్ ను అందించే ఈవీ స్కూటీ ఇదేనని కంపెనీ గట్టిగానే చెబుతోంది. ఎస్ 1 లైట్ గా నామకరణం చేసిన ఈవీ స్కూటర్ గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

కాగా ఇది iVOOMi నుంచి విడుదల అయిన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇంతకుముందు లాంచ్ అయిన స్కూటర్ 10 వేలమంది కొనుగోలు చేయగా, ఈ సారి లాంచ్ చేసిన iVOOMi S1 liteలో ప్రత్యేక ఫీచర్లు చాలానే ఉన్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా శక్తివంతమైన ఫీచర్లు జోడించింది కంపెనీ. మరి ముఖ్యంగా అన్నింటికంటే ప్రత్యేకమైంది రిమూవబుల్ బ్యాటరీ. ఈ స్కూటర్ నుంచి బ్యాటరీ తొలగించి ఇంట్లో ఛార్జ్ చేసుకుని తిరిగి మరి అమర్చుకోవచ్చు. అయితే కేవలం ఇదొక్కటే కాకుండా ఇందులో 7 అంచెల సెక్యూరిటీ కూడా ఇవ్వబడింది. దీనికి మూడేళ్ల వారంటీ కూడా ఉంటుందట. iVOOMi S1 lite మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇందులో వైట్, గ్రే, రెడ్, బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ వంటి కలర్స్ లభించనున్నాయి. మీకు సమీపంలో ఉండే డీలర్ వద్ద వెంటనే బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ స్కూటర్ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇకపోతే ధర విషయానికొస్తే… ఇందులో 2 బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. గ్రాఫీన్ ఐయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 54,999 రూపాయలు కాగా లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర 64,999 రూపాయలుగా ఉంది. ఐపీ 67 రేటింగ్ కలిగి ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 45 నుంచి 55 కిలో మీటర్లు. అంటే లోకల్‌గా తిరిగే వాళ్లకు, పెద్ద వాళ్లకు, మహిళలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్ లైట్ వెయిట్‌గా ఉంటుందట. అలాగే ఈ స్కూటర్ ని ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు 120 కిలో మీటర్లు ప్రయాణిస్తుందట. రూ. 1499 రూపాయల ఈఎంఐ ఆప్షన్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉంటుంది. బూట్ స్పేస్ 18 లీటర్లుగా ఉంది. ఇక ఎల్ఈడీ డిస్‌ప్లేతో స్పీడోమీటర్ ఉండి 10, 12 అంగుళాల వీల్స్ కూడా ఉంటాయని కంపెనీ వెల్లడించింది.