Site icon HashtagU Telugu

iVOOMi S1 lite: తక్కువ ధరకే ఎక్కువ మైలేజ్ తో ఆకట్టుకుంటున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్?

Mixcollage 28 Jun 2024 12 38 Pm 5719

Mixcollage 28 Jun 2024 12 38 Pm 5719

భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్న విషయం తెలిసిందే. వీటితోపాటు తాజాగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో అత్యంత చౌక ధరలో, అత్యధిక మైలేజ్ ఇచ్చే ఈవీ స్కూటర్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఎస్1 లైట్‌గా పిలవబడే ఈ ఈవీ స్కూటర్ గురించి పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా iVOOMi నుంచి ఇది రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్.

ఇంతకుముందు లాంచ్ అయిన స్కూటర్ 10 వేలమంది కొనుగోలు చేశారు. ఈసారి లాంచ్ చేసిన iVOOMi S1 liteలో ప్రత్యేక ఫీచర్లు చాలా ఉన్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా శక్తివంతమైన ఫీచర్లు జోడించింది కంపెనీ. అన్నింటికంటే ప్రత్యేకమైంది రిమూవబుల్ బ్యాటరీ. ఈ స్కూటర్ నుంచి బ్యాటరీ తొలగించి ఇంట్లో ఛార్జ్ చేసుకుని తిరిగి అమర్చుకోవచ్చు. ఇదొక్కటే కాకుండా ఇందులో 7 అంచెల సెక్యూరిటీ ఇవ్వబడింది. మూడేళ్ల వారంటీ ఉంటుంది. iVOOMi S1 lite మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఇందులో వైట్, గ్రే, రెడ్, బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ ఉన్నాయి. మీకు సమీపంలో ఉండే డీలర్ వద్ద వెంటనే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బుకింగ్స్ నడుస్తున్నాయి. ఇక ధర విషయానికొస్తే ఇందులో 2 బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. గ్రాఫీన్ ఐయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర 54,999 రూపాయలు కాగా లిథియం ఐయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర 64,999 రూపాయలుగా ఉంది. ఐపీ 67 రేటింగ్ కలిగి ఉంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 45 నుంచి 55 కిలోమీటర్లు. అంటే లోకల్‌గా తిరిగేవాళ్లకు, పెద్దవాళ్లకు, మహిళలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూటర్ లైట్ వెయిట్‌గా ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 1499 రూపాయల ఈఎంఐ ఆప్షన్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎం ఉంటుంది. బూట్ స్పేస్ 18 లీటర్లుగా ఉంది. ఇక ఎల్ఈడీ డిస్‌ప్లేతో స్పీడోమీటర్ ఉండి 10, 12 అంగుళాల వీల్స్ ఉంటాయి