అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ మార్కెట్ లో ఎన్నో ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కొందరు కేవలం లుక్ కోసం మాత్రమే స్టైలిష్ బండలు కొనుగోలు చేస్తే మరి కొందరు అత్యధికంగా మైలేజ్ ఇచ్చే బైక్స్ ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో ఎన్నో రకాల బైక్స్ ఉండటంతో ఎలాంటి బైక్ ని కొనుగోలు చేయాలో తెలియక చాలామంది తికమక పడుతూ ఉంటారు. మీరు కూడా అత్యధికంగా మైలేజ్ ఇచ్చే బైక్స్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా. మరి అధికంగా మైలేజ్ ఇచ్చే ఆ టాప్ 5 బైక్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది బజాజ్ ప్లాటినా 110. ఈ బైక్ మైలేజ్ లీటర్‌కు దాదాపుగా 70 నుంచి 75 కిలో మీటర్లు ఉంటుంది.
115 సిసి ఇంజన్ ఉంటుంది. కంఫర్టబుల్ సస్పెన్షన్, ట్యూబ్‌లెస్ టైర్స్, డీటీఎస్ ఐ ఇంజన్ టెక్నాలజీ ఉన్నాయి. మరో టీవీఎస్ స్పోర్ట్. ఈ స్పోర్ట్స్ బైక్ కూడా 70 నుంచి 75 కిలోమీటర్ల మేలేజ్ ఇస్తుంది. 110 సిసి ఇంజన్ తో ఉంటుంది. ఈ కోత్రస్ట్ ఇంజన్, స్లీక్ డిజైన్, లైట్ వెయిట్ ను కలిగి ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ లో మరో బైక్ హీరో స్ప్లెండర్ ఇస్మార్ట్. ఈ బైక్ 113.2 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రోల్‌పై 68 నుంచి 70 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో ఐ3 ఎస్ టెక్నాలజీ ఉంటుంది. స్టైలిష్ లుక్ ఉంటుంది. అలాగే హోండా సిడి 110 డ్రీమ్ బైక్ కూడా అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ లో ఒకటి. ఈ బైక్ 109.5 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రోల్‌పై 65 నుంచి 70 కిలో మీటర్లు ప్రయాణించగలదగు.
హోండా ఈకో టెక్నాలజీతో పొడుగ్గా, కంఫర్టబుల్ సీటింగ్‌తో ఉంటుంది. ఇక ఇందులో టాప్ ఫైవ్ బైక్ విషయానికి వస్తే.. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ 97.2 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రెల్‌పై 65 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అయితే బైక్స్ ఇంజన్ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఇంజన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం వంటివి చేస్తుండాలి. దీనివల్ల మైలేజ్ పెరుగుతుంది. టైర్ ప్రెషర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. గాలి తక్కువగా ఉంటే ఇంజన్‌పై ఒత్తిడి లేదా భారం పెరిగి మైలేజ్ తగ్గిపోతుంది.