Raptee Energy e-Bike: మార్కెట్ లోకి రాప్టీ ఎనర్జీ కొత్త ఇ-బైక్.. ఒక్క ఛార్జ్ తో అన్ని కి.మీ ప్రయాణం!

మార్కెట్ లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజల సంఖ్యలో మోటార్ సైకిళ్ళు మార్కెట్లో కొనసాగ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 14 Jan 2024 05 10 Pm 4584

Mixcollage 14 Jan 2024 05 10 Pm 4584

మార్కెట్ లోకి ఎన్నో రకాల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజల సంఖ్యలో మోటార్ సైకిళ్ళు మార్కెట్లో కొనసాగుతుండగా వాటికి తోడు కొత్త కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి వాహన తయారీ సంస్థలు. అందులో భాగంగానే త్వరలోనే మరో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మార్కెట్ లోకి విడుదల కానుంది. చెన్నైకి చెందిన ఈవీ స్టార్టప్ రాప్టీ ఎనర్జీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సీ-త్రూ వెర్షన్‌ను తమిళనాడులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ లో ప్రదర్శించింది. అతి త్వరలో ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌కు రెడీగా ఉంది.

ఈ కొత్త మోడల్‌కు ఫీచర్ల వివరాలను ఈవెంట్‌లో రివీల్ చేసింది. ఈ ప్రత్యేకమైన ఈవీ బైక్ అధికారిక లాంచ్ ఏప్రిల్ 2024లో జరగనుంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్, తయారీదారు క్లెయిమ్ చేసినట్లుగా శక్తివంతమైన డ్రైవ్‌ట్రెయిన్‌తో గంటకు 135 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందిస్తుంది. అంతే కాకుండా ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు 150 కిమీ వరకు వేగాన్ని అందుకోగలదు. సీసీఎస్2 స్టేషన్‌లలో వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా అందిస్తుంది. దీనిని ఏదైనా ఛార్జింగ్ స్టేషన్‌లో వాహనాన్ని ఛార్జ్ చేసుకోవచ్చు.

80 శాతం సామర్థ్యాన్ని చేరుకోవడానికి కేవలం 45 నిమిషాలు లేదా 40 కి.మీల పరిధికి 15 నిమిషాల ఛార్జ్ అవసరం. అంతేకాకుండా, శక్తివంతమైన మోటారును కలిగిన మోటార్‌సైకిల్ ఈవీ బైక్ 3.5 సెకన్లలో నిలిచిపోయినప్పటి నుంచి గంటకు 60 కిలోమీటర్ల వరకు నడిపించగలదని ఈవీ తయారీదారు పేర్కొంది. అయితే ఈవీ స్టార్టప్ ఇప్పటికే చెన్నైలో మొదటి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపాదిత రూ. 85 కోట్ల పెట్టుబడితో 4 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆర్ అండ్ డీ కేంద్రాన్ని కలిగిన ఈ సదుపాయం వచ్చే రెండేళ్లలో ఏటా 1 లక్ష యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది.

  Last Updated: 14 Jan 2024, 05:11 PM IST