తిరిగి వస్తున్న ఐకాన్ కారు.. కొత్త రెనాల్ట్‌ డస్టర్ ఫొటోలు వైర‌ల్!

కొత్త డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్‌వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది.

Published By: HashtagU Telugu Desk
Renault Duster

Renault Duster

Renault Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV సెగ్మెంట్లోకి రెనాల్ట్‌ తన ఐకానిక్ మోడల్ డస్టర్‌ను తిరిగి తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 2012లో భారతదేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు పునాది వేసిన కారు రెనో డస్టర్. సుమారు దశాబ్దం తర్వాత ఇప్పుడు సరికొత్త అవతారంలో ఈ కారు మళ్లీ రాబోతోంది. కంపెనీ దీనిని “రిటర్న్ ఆఫ్ ఆన్ ఐకాన్”గా అభివర్ణించింది. ఈ కొత్త డస్టర్ జనవరి 26, 2026న లాంచ్ కానుంది.

డిజైన్ ఎలా ఉండబోతోంది?

రెనో విడుదల చేసిన టీజర్‌లో SUV వెనుక భాగం కనిపిస్తోంది. ఇది మునుపటి కంటే చాలా మోడ్రన్‌గా, బోల్డ్‌గా ఉంది. అంతర్జాతీయ మోడల్‌తో పోలిస్తే ఇందులో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉండటం ప్రత్యేకత. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎత్తైన రూఫ్ రెయిల్స్ దీనికి ఒక ప్రీమియం, ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తున్నాయి. పాత డస్టర్ రగ్గడ్ డిజైన్ అలాగే ఉంచుతూనే కొత్త హంగులు అద్దారు.

ఫీచర్ల అప్‌డేట్స్

కొత్త రెనో డస్టర్ క్యాబిన్ లోపల భారీ మార్పులు ఉండబోతున్నాయి. 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ ఫీచ‌ర్ల‌తో అందుబాటులోకి రానుంది. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Also Read: రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

భద్రత

సేఫ్టీ విషయంలో కూడా రెనో ఏమాత్రం తగ్గడం లేదు.అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వచ్చే అవకాశం ఉంది. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో కారు అందుబాటులోకి రానున్న‌ట్లు సమాచారం. ఆధునిక భద్రత కోసం ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లను కూడా ఆశించవచ్చు.

ధర- పోటీ

కొత్త డస్టర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్‌వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్ వంటి దిగ్గజ కార్లతో తలపడనుంది. జనవరి 26న దీని లాంచ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

  Last Updated: 29 Dec 2025, 06:33 PM IST