Site icon HashtagU Telugu

Electric Vehicle Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందా?

Electric Vehicles

Electric Vehicles

Electric Vehicle Market: ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ (Electric Vehicle Market) వేగంగా పెరుగుతోంది. మంచి ఆఫర్లతో సరసమైన మోడల్స్ మార్కెట్లోకి రావడం ప్రారంభించినప్పటి నుండి కస్టమర్లు EVల వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు EVలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. కానీ నేడు వాటి ధర పెట్రోల్ వాహ‌నాల‌తో సమానంగా మారాయి. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల సహకారం వేగంగా పెరుగుతోంది. థింక్ మొబిలిటీ నివేదిక ప్రకారం.. 36% మంది కస్టమర్‌లు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆటో ఎక్స్‌పోలో EVలు లాంచ్ అవుతున్నాయి

ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో కూడా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లపైనే దృష్టి సారించాయి. కార్ కంపెనీలు కూడా అవసరం, బడ్జెట్ ప్రకారం ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి సారిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ వేగంగా పెరిగిన విష‌యం తెలిసిందే.

Also Read: Planetary Parade : ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోల దృశ్యం..ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు

ఎలక్ట్రిక్ కార్లు మహిళల ఎంపికగా మారుతున్నాయి

థింక్ మొబిలిటీ నివేదిక ప్రకారం.. పురుషులతో పాటు మహిళలు కూడా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. థింక్ మొబిలిటీ ఈ నివేదికను Google, BCG అందించాయి. యుఎస్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ లాగానే భారతదేశం కూడా ఎలక్ట్రిక్ కార్లలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇటీవల సస్టైనబిలిటీ సర్క్యులారిటీపై 3వ అంతర్జాతీయ సదస్సును SIAM (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా పాల్గొన్నారు. మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. CO2 ఉద్గారాలను తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి ఎలక్ట్రిక్ వాహనాలు సహాయపడతాయన్నారు.

2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెంచ‌డ‌మే ల‌క్ష్యం

సున్నా ఉద్గార లక్ష్యాన్ని చేరుకోవడానికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ఆటో పరిశ్రమను ప్రోత్సహించడం ఇప్పుడు చాలా ముఖ్యమైనదిగా మారిందని భూపేంద్ర యాదవ్ అన్నారు. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను 50%కి తీసుకెళ్లడమే త‌మ‌ లక్ష్యమ‌న్నారు. గతేడాది భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ మంది పురుషులతో పాటు మహిళలను ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం అనేక కొత్త మోడల్స్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి EV మార్కెట్ మ‌రింత‌ పెరుగుతుందని అంచనా.