Site icon HashtagU Telugu

Two Wheeler : ఈ చిన్న చిట్కాలతో టూవీలర్ లైఫ్ పర్ఫామెన్స్ ను పెంచుకోండిలా..?

Increase The Two Wheeler Life Performance With These Small Tips..

Increase The Two Wheeler Life Performance With These Small Tips..

Two Wheeler Life Performance : ప్రస్తుత రోజుల్లో దేశవ్యాప్తంగా టూవీలర్ ల వాడకం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క ఇంటికి ఒక బైక్ తప్పనిసరిగా ఉంది. ఇంకా పెద్ద పెద్ద ఫ్యామిలీలో అయితే ఒకే ఇంట్లో రెండు మూడు బైకులు ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా రోజురోజుకీ దేశవ్యాప్తంగా టూవీలర్ (Two Wheeler)ల వాడకం వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగానే ఆయా కంపెనీలు వినియోగదారుల కోసం అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి బైక్స్ ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే బైక్స్ కొనుగోలు చేస్తున్నారు కానీ చాలామందికి టూవీలర్ల మెయింటెనెన్స్‌పై అవగాహన ఉండట్లేదు. దీంతో మోటార్‌ సైకిళ్ల లైఫ్, పర్ఫార్మెన్స్ క్రమంగా తగ్గుతుంది.

We’re Now on WhatsApp. Click to Join.

మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా వెహికల్స్ పనితీరుపై ప్రభావం చూపుతాయని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మరి టూవీలర్ల (Two Wheeler) పర్ఫామెన్స్, లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే ఎటువంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో మోటార్‌సైకిళ్ల ఫిట్‌నెస్ సరిగా ఉండాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలి. ఇవి టూవీలర్ (Two Wheeler) లైఫ్‌ను, పర్ఫార్మెన్స్‌ను సైతం పెంచుతాయి. అలాగే బెస్ట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. చలికాలంలో ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చాలి. బైక్ నిర్ణీత కిలోమీటర్లు తిరిగిన తర్వాత, పాత ఆయిల్ తీసివేసి క్వాలిటీ ఇంజిన్ ఆయిల్‌ ఫిల్ చేయాలి. చలికాలం ప్రారంభంలోనే ఇలా చేయడం మంచిది. ఇది ఇంజిన్‌లోని కాంపోనెంట్స్‌ను రక్షిస్తుంది.

ఈ సీజన్‌లో సేఫ్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అవసరమైతే ఆయిల్ ఫిల్టర్‌ను కూడా మార్చడం చాలా మంచిది. అలాగే చైన్ సెట్‌ మోటార్‌సైకిల్‌లో అత్యంత సున్నితమైనది, ముఖ్యమైనది. ఈ సీజన్‌లో మైటార్‌సైకిల్ చైన్‌ చాలా ధూళిని ఆకర్షిస్తుంది. దాంతో చైన్ తుప్పు పట్టడం ప్రారంభమవుతుంది. క్రమంగా వెహికల్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు చైన్ సెట్‌ మొత్తాన్ని మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పార్ట్‌కు సరిగ్గా గ్రీజు కొట్టాలి. బైక్ సరిగా రన్ అయ్యేలా చైన్ లూబ్రికెంట్‌గా ఉండాలి. అయితే ఇందుకు చీప్ ఆయిల్స్ అస్సలు వాడకుండా కొంచం మంచి ఆయిల్స్ వాడటం మంచిది. సేఫ్ జర్నీ, మంచి రైడింగ్‌ను ఆస్వాదించాలంటే బైక్ టైర్ల ప్రెజర్ సరిగా ఉండాలి.

ముందు టైర్‌లో గాలి 18-20 PSI, వెనుక టైర్లలో 24-26PSI ప్రెజర్ ఉండాలి. అయితే ఈ లెక్కలు టైర్ సైజు, బైక్ మొత్తం బరువు ఆధారంగా మారవచ్చు. చల్లని ఉష్ణోగ్రతలు, టూవీలర్ల బ్యాటరీపై ప్రభావం చూపిస్తాయి. దీంతో బైక్ త్వరగా స్టార్ట్ కాదు. హారన్, ఇండికేటర్స్ కూడా పని చేయకపోవచ్చు. అందుకే చలికాలం ప్రారంభంలోనే బ్యాటరీ హెల్త్, వోల్టేజ్, వాటర్ లెవర్‌ను సరిగా చెక్ చేయాలి. పాత బ్యాటరీలను తప్పనిసరిగా మార్చాలి. అలాగే కొత్త బ్యాటరీ ఫిక్స్ చేసేముందు, టెర్మినల్స్‌ను శుభ్రం చేయాలి.

Also Read:  Eventbrite : ఈ కంపెనీకి జాబ్ అప్లికేషన్లు 100% పెరిగాయ్.. ఎందుకు ?