Site icon HashtagU Telugu

Tips to Increase Mileage of a Car: మీ కారు మైలేజ్ రావడం లేదా.. ఈ 4 విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

Tips To Increase Mileage Of A Car

Tips To Increase Mileage Of A Car

ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. కొన్ని విదేశాలలో రోజురోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే మామూలుగా వాహన వినియోగదారులు వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా అడిగే ప్రశ్న మైలేజ్ ఎంత. వాహనాలు కొనుగోలు చేసిన కొత్తలో మైలేజ్ వచ్చినట్టు ఆ తర్వాత రావు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకవేళ మీ వాహనాలు మైలేజ్ రాకపోతే ఆ సమయంలో ఏం చేయాలి ఎటువంటి విషయాలను గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా డ్రైవింగ్ చేసేటప్పుడు తరచుగా క్లచ్ ఉపయోగించడం మానేయాలి. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నారన్నమాట. అవసరం లేని చోట క్లచ్‌ని అస్సలు ఉపయోగించకూడదు. కొత్త డ్రైవర్లు తరచుగా క్లచ్‌ను వినియోగిస్తారు. ఇది మీ క్లచ్ ప్లేట్‌లను కూడా దెబ్బతీస్తుంది. అవసరమైనప్పుడు మాత్రమే క్లచ్ ను వినియోగించడం మంచిది. అదేవిధంగా కారు టైర్లలో ఎప్పుడూ సరైన ప్రెజర్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే టైర్‌లో తక్కువ గాలి ఉండటం దాని మైలేజీ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ గాలి టైర్ పగిలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

అందుకే గాలి పీడనాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడం చాలా ముఖ్యం. అలాగే కారు నడుపుతున్నప్పుడు, కారు వేగాన్ని ఎప్పుడూ చాలా తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉంచకూడదు. ఎందుకంటే కారు మైలేజ్ గరిష్ట వేగంపై ఆధారపడి ఉంటుంది. సరైన వేగంతో డ్రైవ్ చేస్తే అత్యుత్తమ మైలేజీ వస్తుంది. కారు వేగం గంటకు 80 కి.మీ నుండి 100 కి.మీల మధ్య ఉంటే, హైవేపై కారు మంచి మైలేజీని ఇస్తుంది. సర్వీస్ మెయింటెనెన్స్ కారు సాధారణ సర్వీస్ దాని మైలేజీని పెంచడంలో సహాయపడుతుంది. ఇంజిన్లు గేర్‌బాక్స్‌ల వంటి వాహనాల తిరిగే భాగాలకు లూబ్రికేషన్ అవసరం. సర్వీసింగ్ సరిగా చేయించకపోతే మైలేజీ తగ్గుతుంది. కావున కారు కొత్తదైనా పాతదైనా సరే ఎప్పటికప్పుడు సర్వీస్ చేయడం తప్పనిసరి. కనీసం ఏడాదికి ఒకసారి లేదా 10 వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత అయినా సర్వీస్ చేయించడం మంచిది.