Electric Car: ఎలక్ట్రిక్ కారులో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?

సాధారణంగా చాలామంది పెట్రోల్, డీజిల్ తో కాకుండా ఎలక్ట్రిక్ కారుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని అనుకుంటూ

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 04:48 PM IST

సాధారణంగా చాలామంది పెట్రోల్, డీజిల్ తో కాకుండా ఎలక్ట్రిక్ కారుతో ఎక్కువ దూరం ప్రయాణించాలని అనుకుంటూ ఉంటారు. కానీ చార్జింగ్ సమస్యతో కు దూరం వెళ్లలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఎలక్ట్రిక్ కారులో ఎక్కువ దూరం ప్రయాణించాలి అనుకున్న వారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం వల్ల మీరు ఈజీగా అనుకున్న దూరం ప్రయాణించవచ్చు. మరి ఎటువంటి విషయాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి. కారుకి అందించిన మ్యాన్యువల్ సూచనలను పూర్తిగా చదవాలి. అలాగే వాహన తయారీ సంస్థ వెబ్సైట్లో కూడా కారుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది.

అందులో ప్రతి కారు పూర్తిగా చార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది పూర్తి చార్జ్ అయిన తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది అన్న విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మీ ఈవి ని ఛార్జ్ చేయడానికి ఎటువంటి సాకెట్ అవసరమో అన్నది కూడా తెలుసుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణించాలి అనుకున్నప్పుడు మధ్య మధ్యలో కొన్ని స్టాఫులు ఉండే విధంగా ప్లాన్ తీసుకుంటూ చార్జింగ్ తో పూర్తి ప్రయాణం చేసేలా చూసుకోవాలి. అలాగే మీరు వెళ్లే ప్రదేశంలో చార్జింగ్ సౌకర్యం ఉందో లేదో కూడా చూసుకోవాలి. చార్జింగ్ సౌకర్యం ఉన్న హోటల్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా చార్జింగ్ స్టేషన్ మీరు ప్రయాణించే మొత్తం రూట్ లో ఉండే విధంగా చూసుకోవాలి. మీరు హోటల్లో దగ్గర తినడానికి ఆగినప్పుడు ఆ సమయంలో కారుని చార్జ్ చేయడం మంచిది.

ఇక ప్రభుత్వ ఇ అమృత్ వెబ్ సైట్ ద్వారా చార్జింగ్ లొకేటర్ సహాయంతో చార్జింగ్ స్టేషన్ ల గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఈవి డ్రైవింగ్ కు సంబంధించిన విషయాలను దృష్టిలో ఉంచుకోవడం వల్ల మీ ఈవి పరిధిని సమర్థవంతంగా పెంచుకోవచ్చు. అలాగే కారు స్పీడు పెంచడం తగ్గించడం లాంటివి చేయడం వల్ల చార్జింగ్ అయిపోతుంది. 70 నుండి 80 kmph వేగంతో వెళితే మెరుగైన రేంజ్ ని అందిస్తుంది. అలాగే సడన్ బ్రేకింగ్ బ్యాటరీ పై ఒత్తిడిని కలిగిస్తుంది. అదేవిధంగా అత్యవసర పరిస్థితులను దుస్తులు పెట్టుకొని మీకు వాహనానికి అనుగుణంగా పోర్టబుల్ చార్జర్ ని తీసుకొని వెళ్లడం మంచిది. అలాగే దూరప్రాంతాలకు వెళ్లే సమయంలో లగేజీ తేలికగా ఉండే విధంగా చూసుకోవాలి. బరువైన లగేజీ వల్ల ఈవి ల మైలేజ్ తగ్గుతుంది. అధిక బరువు వల్ల బ్యాటరీ పై ఒత్తిడి తెచ్చి చార్జింగ్ త్వరగా అయిపోతుంది.