Hyundai Venue With Sunroof: పండుగల సీజన్‌కు ముందు హ్యుందాయ్ (Hyundai Venue With Sunroof) ఇండియా తన పోర్ట్‌ఫోలియోను గణనీయంగా బలోపేతం చేసింది. కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ వెన్యూ SUVకి కొత్త E Plus వేరియంట్‌ని జోడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.23 లక్షలు. ఈ కొత్త వేరియంట్ ఎంట్రీ-లెవల్ E వేరియంట్ పైన ఉంది. అదే సమయంలో ఇది దాదాపు రూ. 29,000 వరకు ఖరీదైనది. వెన్యూ స్టాండర్డ్ ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో ఫ్రంట్ పవర్ విండోస్, మాన్యువల్ AC, మాన్యువల్ డే-నైట్ IRVM, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్, ఐసోఫిక్స్ సీట్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS ఉన్నాయి. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
కొత్త E+ వేరియంట్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఇది ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వస్తుంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, వెనుక సీట్ల కోసం రెండు-దశల రిక్లైన్ ఫంక్షన్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్‌రెస్ట్‌లను కలిగి ఉంది. పగలు, రాత్రి సర్దుబాటు చేయగల IRVM, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Mahesh Goud PCC Chief : మహేష్ గౌడ్ కు పీసీసీ పదవి దక్కడం ఫై జగ్గారెడ్డి రియాక్షన్ ..
ప్రస్తుత వెన్యూలో మూడు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది 83bhp శక్తితో 1.2L పెట్రోల్. రెండవది 120bhp శక్తితో 1.0L టర్బో పెట్రోల్ ఉంది. మూడవది 100bhp పవర్‌తో 1.5L డీజిల్ ఇంజన్. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్ (1.2L NA పెట్రోల్‌తో మాత్రమే), 6-స్పీడ్ మాన్యువల్ (డీజిల్‌తో మాత్రమే), iMT (టర్బో-పెట్రోల్‌తో మాత్రమే), 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ (టర్బో-పెట్రోల్‌తో మాత్రమే) చేర్చబడ్డాయి.
అక్టోబర్ 2025 నాటికి అందుబాటులోకి వస్తుంది
హ్యుందాయ్ కొత్త తరం వెన్యూని 2025లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ 2027 చివరిలో కొత్త తరం గ్రాండ్ i10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా తీసుకువస్తుంది. హ్యుందాయ్ తన కొత్త తలేగావ్ ప్లాంట్‌లో సరికొత్త వెన్యూని ఉత్పత్తి చేస్తుంది. నివేదికలు విశ్వసిస్తే.. ఈ సబ్ కాంపాక్ట్ SUV కొత్త మోడల్ ఉత్పత్తి అక్టోబర్ 2025 నాటికి ప్రారంభమవుతుంది. దీని సంకేతనామం QU2i. 2025 వెన్యూ రూపకల్పన, ఫీచర్లలో చాలా అప్‌డేట్‌లు కనిపిస్తాయి.