Hyundai Exter Super Features : ఆర్డినరీ ప్రైస్ లో ఎక్స్ ట్రాడినరీ వెహికల్.. హ్యుందాయ్ ‘ఎక్స్ టర్’

Hyundai Exter Super Features : హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీ ‘ఎక్స్ టర్’ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Published By: HashtagU Telugu Desk
Hyundai Exter Super Features

Hyundai Exter Super Features

Hyundai Exter Super Features : హ్యుందాయ్ మోటార్ సరికొత్త ఎస్ యూవీ ‘ఎక్స్ టర్’ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది కూడా రూ.5.99 లక్షల నుంచి రూ.9.31 లక్షల ప్రైస్ రేంజ్ లో !!  మధ్య తరగతి ప్రజలు కూడా కొనగలిగేలా దీని ధరను నిర్ణయించారు. ఈ మోడల్‌ కారును తీర్చిదిద్దడానికి రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు (Hyundai Exter Super Features) హ్యుందాయ్ మోటార్ ఇండియా సీఎండీ ఉన్సూ కిమ్ వెల్లడించారు.

Also read : Amaravathi Capital : సుప్రీంలో జ‌గన్ కు మ‌రో షాక్‌! అమ‌రావ‌తి రాజ‌ధాని పదిలం!!

ఫీచర్లు ఇవీ.. 

  •  ఎక్స్​టర్​ ఎస్​యూవీలో ప్రొజెక్టర్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, ఎల్​ఈడీ టెయిల్​ ల్యాంప్స్​, బ్లాక్​ రేడియేటర్​ గ్రిల్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఇండికేటర్​ మౌంటెడ్​ ఓఆర్​వీఎంలు, క్లాడింగ్​, 15 ఇంచ్​ డైమెంట్​ కట్​ అలాయ్​ వీల్స్​ ఉంటాయి.
  • ఎక్స్​టర్​ ఎస్​యూవీలో డైమెన్షన్స్​ విషయానికొస్తే.. ఎక్స్​టర్​ పొడవు 3,815 మిల్లీమీటర్లు ..  వెడల్పు 1,710 మిల్లీమీటర్లు ఉంటుంది. వీల్ ​బేస్​ 2,450 మిల్లీమీటర్లు ఉంటుంది.
  • హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీలో  5 సీటర్​ కేబిన్​లో బ్లాక్​డ్​ ఔట్​ డాష్​బోర్డ్​, లెథర్​ వ్రాప్డ్​ స్టీరింగ్​ వీల్​, కూల్డ్​ గ్లోవ్​ బాక్స్​, మెటల్​ పెడల్స్​, రేర్​ ఏసీ వెంట్స్​, క్రోమ్​ ఫినిష్డ్​ గేర్​ నాబ్​లు వస్తున్నాయి.
  • ఎక్స్​టర్​ ఎస్​యూవీలో  వైర్ ​లెస్​ స్మార్ట్​ఫోన్​ ఛార్జర్​, 2.32 ఇంచ్​ డిస్​పలే ట్విన్​ కెమెరాలతో కూడిన డాష్​బోర్డ్​ ఉంటాయి. 8 అంగుళాల ​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్ కూడా ఉంటుంది​. డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, వాయిస్​ కమాండ్​తో కూడిన ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, క్రూజ్​ కంట్రోల్​, ఏబీఎస్​, ఈఎస్​సీ వంటివి సైతం లభిస్తాయి.
  • ఎక్స్​టర్ లో 1.2 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 82 హెచ్​పీ పవర్​ను, 113.8 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 5 స్పీడ్​ మేన్యువల్​/ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్​ ఉంది. సీఎన్​జీ వేరియంట్​ కూడా అందుబాటులో ఉండనుంది.
  • ఎక్స్​టర్​ ఎస్​యూవీలో పెట్రోల్‌ వెర్షన్‌ 19.4 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. సీఎన్‌జీ వెర్షన్‌ 27.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
  • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డిజిటల్‌ క్లస్టర్‌ కూడా  ఉన్నాయి.
  • 5.84 సెంటిమీటర్ల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు వాహనం ముందు, వెనుక వైపు రెండు కెమెరాలు ఉంటాయి.

Also Read:  ED Chief Extension Illegal : కేంద్రానికి సుప్రీం షాక్.. ఈడీ చీఫ్ పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని వ్యాఖ్య

  Last Updated: 12 Jul 2023, 01:40 PM IST