Site icon HashtagU Telugu

Hyundai Exter: మార్కెట్ లోకి హ్యుందాయ్ సరికొత్త కార్.. ధర, ఫీచర్స్ ఇవే?

Hyundai Exter

Hyundai Exter

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి సరికొత్త ఎక్స్‌టర్ వచ్చే నెల అనగా జూలై 10న భారత మార్కెట్లో విడుదల కానుంది. టాటా పంచ్‌కు టీగా మైక్రో ఎస్‌యూవీ, డ్యూయల్‌ తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌ తో సహా సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ లతో రానుంది. కాగా ఎక్స్‌టర్ సన్‌రూఫ్ వాయిస్-ఎనేబుల్ ఉంటుంది. ఓపెన్ సన్‌రూఫ్ వంటి కమాండ్స్‌కు రెస్పాండ్ అవుతుంది. డాష్‌క్యామ్‌లో ముందు, వెనుక కెమెరా, 2.31 అంగుళాల LCD డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ యాప్ ఆధారిత కనెక్టివిటీ, మల్టీ రికార్డింగ్ మోడ్‌లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఫుల్ HD వీడియో రిజల్యూషన్‌ కు సపోర్టు ఇస్తుంది.

వినియోగదారులు ముందు, వెనుక కెమెరాల నుంచి ఫొటోలను తీసేందుకు అనుమతిస్తుంది. డ్రైవింగ్, ఈవెంట్, సెలవు వంటి మల్టీ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్, అన్ని సీట్లకు సీట్‌బెల్ట్ రిమైండర్, కీలెస్ ఎంట్రీ, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్‌తో సహా 26 సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి.

అదేవిధంగా బయటి భాగంలో, హ్యుందాయ్ ఎక్స్‌టర్ పారామెట్రిక్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హెచ్-సిగ్నేచర్ LED DRL, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పారామెట్రిక్ డిజైన్ C-పిల్లర్ గార్నిష్, బ్రిడ్జ్-టైప్ రూఫ్ రెయిల్‌లు, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. క్యాబిన్ లోపల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను EX, S, SX, SX(O), SX(O) Connect అనే 5 ట్రిమ్‌లలో అందిస్తోంది. ఈ కారులో ఇంజన్, ట్రాన్స్‌మిషన్, ట్రిమ్ కాంబినేషన్‌ల ఆధారంగా 15 వేరియంట్‌లుగా కేటగిరీ చేసింది.హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌. గరిష్టంగా 83PS పవర్, 113.8Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లను కలిగి ఉంది. మైక్రో-SUVకి 5-స్పీడ్ MTతో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ బుకింగ్‌లు ఇప్పటికే తెరిచి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు లేదా కార్‌మేకర్ క్లిక్ టు బై ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రూ. 11వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుకింగ్‌లు చేయవచ్చు. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.50 లక్షలు గా ఉంది.