భారతదేశంలో హ్యూందాయ్ కార్లకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాహనవినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే వాటిలో ఈ హ్యూందాయ్ కార్లు కూడా ఒకటి. ఈ కంపెనీలో ఎక్కువగా అమ్ముడు అవుతున్న వాటిలో హ్యూందాయ్ మోటార్ ఇండియా ఒకటి. అయితే ఈ కారును ఇప్పుడు హ్యూందాయ్ అప్ గ్రేడ్ చేసింది. హ్యూందాయ్ క్రెటా కైట్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో తాజాగా దీనిని లాంచ్ చేసింది. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ లో అత్యధికంగా స్టైలింగ్ మీద ఫోకస్ పెట్టారు. పాత క్రెటాతో పోల్చితే దీనిలో అనేక రకాల విజువల్ అప్ గ్రేడ్స్ కనిపిస్తున్నాయి.
ఈ ఎస్ యూవీలో పాత మోడళ్లో ఉన్న మెకానికల్స్, డైమెన్షన్స్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ కారుకు సంబంధించి మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త మోడల్ స్టన్నింగ్ ఆల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తోంది. ఇన్ సైడ్, అవుట్ సైడ్ ఇదే కాంబినేషన్ లో ఉంటుంది. ఎక్స్ టీరియర్ విషయానికి వస్తే డార్క్ థీమ్ డిజైన్ తో వస్తుంది. బ్లాక్డ్ అవుట్ గ్రిల్, స్కిడ్ ప్లేట్స్, మ్యాట్ బ్లాక్ హ్యూందాయ్ లోగో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ కూడా బ్లాక్ థీమ్ ఉంటుంది. బ్లాక్డ్ అవుట్ ఆర్వీఎం, రూఫ్ రెయిల్స్, 17 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. స్పోర్టీ లుక్ కోసం బ్లాక్ సైడ్ సిల్స్, సీ పిల్లర్ గార్నిష్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ కారు లోపల కూడా డార్క్ థీమ్ తోనే ఉంటుంది.
ఆల్ బ్లాక్ క్యాబిన్, బ్రాస్ కలర్డ్ ఇన్ సర్ట్స్, మెటల్ పెడల్స్, లెదర్ తో కూడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ కి బ్రాస్ స్టిచ్చింగ్ ఇచ్చారు. 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ వంటి రెండు ఇంజన్లతో ఈ కారు లభిస్తోంది. అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్, ఐవీటీ, సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఏటీలతో అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఈ కారు ధర విషయానికి వస్తే.. ఎడిషన్ కారు వేరియంట్ ను బట్టి రూ. 14.50 లక్షలు నుంచి రూ. 20.14లక్షల వరకూ ఉంటుంది. టైటాన్ గ్రే మ్యాట్ కలర్ కోసం రూ. 5000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే డ్యూల్ టోన్ పెయింట్ కోసం రూ. 15,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. క్రెటా నైట్ పెట్రోల్ వేరియంట్లలో ఎస్(ఓ) ఎంటీ ధర రూ. 14.5లక్షలు కాగా ఎస్(ఓ) ఐవీటీ వేరియంట్ ధర రూ. 17.42లక్షలుగా ఉంది. అలాగే ఎస్ఎక్స్(ఓ) ఐవీటీ ధర రూ. 18.88లక్షలుగా ఉంది. అదే సమయంలో డీజిల్ ఇంజిన్లలో ఎస్(ఓ) ఏటీ ధర రూ. 17.58లక్షలు కాగా ఎస్ఎక్స్(ఓ) ఎంటీ ధర రూ. 18.9లక్షలు గా ఉంది. ఎస్ఎక్స్(ఓ) ఏటీ ధర రూ. 20.14లక్షల వరకూ ఉంటుంది.