Site icon HashtagU Telugu

Hyundai Creta facelift: త్వరలోనే లాంచ్ కాబోతున్న హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​.. ధర, ఫీచర్స్ ఇవే?

Mixcollage 07 Dec 2023 01 43 Pm 7861

Mixcollage 07 Dec 2023 01 43 Pm 7861

హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు చక్కటి శుభవార్తను చెబుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది హ్యుందాయ్ సంస్థ. 2024 జనవరి 16న ఒక ఈవెంట్​ ను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈవెంట్​ నిర్వహణకు గల కారణాన్ని చెప్పలేదు కానీ ఇందులో క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ ని సంస్థ లాంచ్​ చేస్తుందని, ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కాగా హ్యుందాయ్​ క్రేటా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ టెస్ట్​ డ్రైవ్​ ఇప్పటికే చాలాసార్లు జరిగిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో తీసిన ఫొటోలు కొన్ని ఆన్​సోషల్ మీడియాలో ​లో వైరల్ కూడా ​ అయ్యాయి. అయితే ఈ సరికొత్త హ్యుందాయ్​ క్రేటా డిజైన్​ లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఫ్రెంట్​ గ్రిల్​ని రీడిజైన్​ చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా ఫ్రెంట్​- రేర్​ బంపర్స్​, టెయిల్​ ల్యాంప్స్​, అలాయ్​ వీల్స్​ కొత్తగా ఉండవచ్చు. ఇక క్రేటా ఫేస్​లిఫ్ట్​లో డాష్​బోర్డ్​, ఏసీ వెంట్స్​ డిజైన్​ వంటివి కొత్తగా ఉండనున్నాయి. డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్స్​ రాబోతున్నాయి. కొత్త క్రేటాలో 1.5 లీటర్​ పెట్రోల్​, 1.5 లీటర్​ డీజిల్​, 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉంటాయి. అడాస్​తో పాటు 360 డిగ్రీ వ్యూ కెమెరా ఫీచర్​ ఇందులో ఉండనుంది.

ఫార్వర్డ్​ కొలిషన్​ వార్నింగ్- అసిస్టెన్స్​​, రేర్​ క్రాస్​ ట్రాఫిక్​ కొలిషన్​ వార్నింగ్- అసిస్టెన్స్​​, లేన్​ డిపార్చర్​ వార్నింగ్​, సేఫ్​ ఎగ్జిట్​ వార్నింగ్​ వంటివి అడాస్​లో భాగంగా ఉండనున్నాయి. కాగా ఆల్ ​ న్యూ హ్యుందాయ్​ క్రేటా ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10.87లక్షలుగా ఉండవచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. దీని పై హ్యుందాయ్ సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంది.