Site icon HashtagU Telugu

Toyota Mirai : భారత్ లో తొలి హైడ్రోజన్ FCEV … టొయోటా మిరాయ్ ఫీచర్స్ ఇవే..!!

Tayota Merav

Tayota Merav

భారత్ లో ఆటోమొబైల్ రంగం వేగంగా విస్తరిస్తోంది. లేటెస్టు ఫీచర్స్ తోపాటు అధునాతన టెక్నాలజీతో ఇండియా తొలి హైడ్రొజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ కారు టొయోటా మిరాయ్ విడుదల చేసింది. ఈ హైడ్రోజన్ ట్యాంక్ ను రీఫీల్ చేసేందుకు కేవలం 5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఒక్కసారి రీఫీల్ చేస్తే దాదాపు 650 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, ఎఫ్ సిఇవి టెక్నాలజీ యొక్క ప్రత్యేక ప్రయోజనం గురించి అవగాహన కల్పించినట్లయితే…దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. 2014లో లాంచ్ చేసిన టొయోటా మిరాయ్ లో రెండవ జనరేషన్ కు చెందిన వెహికల్ ఇది. దేశంలోనే తొలిసారిగా ఈ కారు ఢిల్లీకి చేరింది. ఈ హైడ్రోజన్ ఆధారిక మోడరన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పైలజ్ ప్రాజెక్టును కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.

ఈ వెహికల్ శిలాజ ఇంధనాలపై ఆధారపడాటాన్ని తగ్గించడం ద్వారా స్వచ్చమైన శక్తి, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన ప్రాజెక్టనే చెప్పాలి. 2047 నాటికి భారత్ శక్తి స్వయం-ఆధారితగా మారుతుంది. హైడ్రోజన్ తో రన్ అయ్యే ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్…బెస్ట్ జీరో ఎమిషన్ సొల్యూషన్స్ ఒకటని చెప్పవచ్చు. ఈ కారు పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైంది. ఇందులో నీరు తప్ప టెయిల్ పైప్ ఎమిషన్స్ లేవు. గ్రీన్ హైడ్రోజన్ పునరుత్పాదకశక్తి, సమ్రుద్ధిగా లభించే బయోమాస్ నుంచి ఉత్పత్తి చేయబడుతుంది.

గ్రీన్ హైడ్రోజన్ శక్తి ఉపయోగించుకోవడానికి టెక్నాలజీని పరిచయం చేయడం ఇంకా స్వీకరించడం అనేది భారత్ స్వచ్చమైన ఇంకా సరసమైన ఇంధన భవిష్యత్తును సురక్షితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి. ఇక మార్చి 16, 2022న జరిగిన ఈ వెహికల్ లాంచ్ లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పాల్గొన్నారు. ఈ వెహికల్ గురించి ట్వీట్ కూడా చేశారు. గ్రీన్ హైడ్రోజన్-భారతదేశాన్ని ఎనర్జీ సెల్ఫ్ రిలయన్ గా మార్చడానికి సమర్థవంతమైన పర్యావరణ అనుకూలమైన, స్థిరమైన ఇంధన మార్గం అని ట్వీట్ చేశారు. ప్రపంచంలోని అత్యంత అధునాతన ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్, భారతదేశ రోడ్లు, వాతావరణ పరిస్థితులపై నడిచే టొయోటా మిరాయన్ ను అధ్యయనం చేసేందుకు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ తో కలిసి టొయోటా ఈ పైలెట్ ప్రాజెక్టును నిర్వహిస్తుంది.

Exit mobile version