Hybrid Scooter: మార్కెట్ లోకి మరో సరికొత్త స్కూటర్.. ఫీచర్స్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఒకదానిని మించి మరొకటి ఫీచర్ల విషయంలో అదరహో అనిపిస్తున్నాయి. వీటి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Jan 2024 03 29 Pm 3689

Mixcollage 12 Jan 2024 03 29 Pm 3689

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల స్కూటర్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఒకదానిని మించి మరొకటి ఫీచర్ల విషయంలో అదరహో అనిపిస్తున్నాయి. వీటికి తోడు కొత్త కొత్త స్కూటర్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాహన తయారీ సంస్థలు అందుకు అనుగుణంగా మంచి మంచి ఫీచర్లు మోడల్స్ కలిగిన స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే మార్కెట్లో హైబ్రిడ్ స్కూటర్లకు డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే.

మైలేజీలో మెరుగ్గా ఉండటం మాత్రమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పును కలిగిస్తాయి. అలాగే, హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంది. అయితే, మార్కెట్‌లోని ఒక కంపెనీ హైబ్రిడ్ స్కూటర్లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ మరేదో కాదు మోటోకార్ప్, బజాజ్ లేదా టీవీఎస్ కాదు, జపాన్‌కు చెందిన యమహా హైబ్రిడ్ ఇంజన్‌తో కూడిన స్కూటర్ శ్రేణిని భారత మార్కెట్లో విక్రయిస్తోంది. హైబ్రిడ్ ఇంజన్ అంటే.. హైబ్రిడ్ టెక్నాలజీ కోసం స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉపయోగించింది. స్కూటర్ ఇంజిన్ స్మార్ట్ జనరేటర్‌గా పనిచేస్తుంది.

ఇది స్కూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన చిన్న లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. స్కూటర్ వేగం తగ్గినప్పుడల్లా, ఈ జనరేటర్ సక్రియం చేయబడి, గతి శక్తిని విద్యుత్‌గా మార్చి బ్యాటరీలో నిల్వ చేస్తుంది. దాని ద్వారా బండి నడుస్తుంది. యమహా అందిస్తున్న ఫాసినో, రేజర్ 125 బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజన్ 16 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తుంది . యమహా ఈ రెండు స్కూటర్ల మైలేజీ లీటరుకు 66 కిలోమీటర్లుగా క్లెయిమ్ చేసింది. అలాగే ఈ ఇంజన్ 8.04 బిహెచ్‌పి పవర్, 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ కొత్త హైబ్రిడ్ స్కూటర్ ధర విషయానికొస్తే.. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,600 నుంచి రూ. 93,630 మధ్య ఉంటుంది, అయితే, రేజర్ 125 ధర రూ. 84,730 నుంచి ప్రారంభమై రూ. 92,630 వరకు ఉంది..

  Last Updated: 12 Jan 2024, 03:29 PM IST