Hybrid vs Plug in Hybrid Cars: హైబ్రిడ్ వర్సెస్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలోమధ్య ఉన్న తేడా ఏంటో మీకు తెలుసా?

ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనే రెండు కార్లు కూడా సంచలనం అని చెప్పవచ్చు. ఈ వాహనాలు రెండూ ఇంధనాన్ని ఆదా చేయడం కోసం అలాగే ఎమి

Published By: HashtagU Telugu Desk
Mixcollage 03 Jan 2024 03 15 Pm 8715

Mixcollage 03 Jan 2024 03 15 Pm 8715

ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ అనే రెండు కార్లు కూడా సంచలనం అని చెప్పవచ్చు. ఈ వాహనాలు రెండూ ఇంధనాన్ని ఆదా చేయడం కోసం అలాగే ఎమిషన్ తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయి. కానీ హైబ్రిడ్ వర్సెస్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్ల మధ్య కొంచం తేడా ఉంది. మరి ఇంతకీ ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటి? రెండింటిలో ఏది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా హైబ్రిడ్ కార్లు రెండురకాల పవర్ ట్రేన్ వినియోగిస్తాయి. ఇందులో ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్‌కు బ్యాటరీ ప్యాక్ ద్వారా పవర్ సప్లై అవుతుంది. కారును నడిపేందుకు ఇంజన్ ప్రధాన భూమిక వహిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ సహాయం అందిస్తుంది. ఇందులో ఉండే బ్యాటరీ ఇంటర్నల్ వ్యవస్థ ద్వారానే ఛార్జ్ అవుతుంది. ఇంజన్ నడిపే సమయంలో ఉత్పత్తి అయ్యే పవర్ ద్వారానే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా హైబ్రిడ్ కార్లలో రీజనరేట్ బ్రేకింగ్ ఉంటుంది. అంటే బ్రేకింగ్ సమయంలో ఉత్పత్తి అయ్యే పవర్ కూడా బ్యాటరీకు చేరుతుంది.

ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు కూడా హైబ్రిడ్ కార్ల మాదిరిగానే ఉంటాయి. కానీ ఇందులో బ్యాటరీ పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఈ బ్యాటరీని బయటి నుంచి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో బ్యాటరీ ఛార్జ్ చేసేందుకు సాకెట్ విడిగా ఇస్తారు. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లు సాధారణ హైబ్రిడ్ కార్లతో పోలిస్తే బ్యాటరీపైనే ఎక్కువ దూరం నడుస్తాయి. ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్లలో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంటుంది. అయితే హైబ్రిడ్ కార్లతో పోలిస్తే ఇవి చాలా ఖరీదు. దేశంలో ప్రస్తుతం హైబ్రిడ్ కార్లే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఎందుకంటే ప్లగ్ హైబ్రిడ్ లేదా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కార్ల కంటే అనువుగా ఉంటున్నాయి. అందుకే ఈ కార్లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

  Last Updated: 03 Jan 2024, 03:16 PM IST