Honda : మీరు కారు కొనాలనుకుంటున్నారా..?ఆ కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్స్ ఇచ్చింది..!!

కారు కొనాలని ఎప్పటినుంచే అనుకుంటున్నారా.? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉండే కారు కావాలని ఎదురుచూస్తున్నారా.

Published By: HashtagU Telugu Desk
Honda

Honda

కారు కొనాలని ఎప్పటినుంచే అనుకుంటున్నారా.? తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్స్ ఉండే కారు కావాలని ఎదురుచూస్తున్నారా. మీ బడ్జెట్ లోనే కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది హోండా కంపెనీ. అవును కార్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేసింది. హోండా కంపెనీ కార్ల అమ్మకాలు ఈ మధ్యకాలంలో బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో డిస్కౌంట్స్ ను తీసుకువచ్చింది. 24శాతం మేర సేల్స్ పడిపోవడంతో..పోయిన నెలలలో 10,125 కార్లను మాత్రమే కంపెనీ అమ్మింది.

హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై కంపెనీ రూ. 27, 496 వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేసింది. 5వేల వరకు నగదు డిస్కౌంట్ తోపాటు 5వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ కింది దీనిలో పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు మీరు హోండా కస్టమర్లు అయితే మీకు లాయల్టీ బోనస్ కింద 5వేలు , 5,496విలువైన యాక్ససరీలు కూడా ఫ్రీగా అందిస్తారు.

4వ జనరేషన్ కార్లపై అయితే 5వేల డిస్కౌంట్ ను కంపెనీ ఇస్తోంది. కానీ ఎక్సేంజ్ డిస్కౌంట్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ ఉండదు. హోండా అమేజ్ కారుపై 8వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. 5వేలు లాయల్టీ బోనస్ ను , 3వేల కార్పొరేట్ డిస్కౌంట్ ను కూడా కంపెనీ కల్పిస్తోంది. హోండా జాజ్ కొనుగోలు చేస్తే 25వేల డిస్కౌంట్ పొందవచ్చు. కారు ఎక్సేంజ్ పై లభించే పదివేల డిస్కౌంట్ 7వేల కారు ఎక్సేంజ్ బోనస్ కూడా వస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 3వేలు వస్తాయి. ఇంకేందుకు ఆలస్యం మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటే…ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

  Last Updated: 03 Sep 2022, 07:15 PM IST