Site icon HashtagU Telugu

బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీగా డిస్కౌంట్.. ధర, ఫీచర్స్ ఇవే?

Bajaj Chetak

Bajaj Chetak

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ధరలను భారీగా తగ్గించింది. భారీ డిస్కౌంట్ తో వినియోగదారులకు అతి తక్కువ ధరలకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లను అందిస్తోంది. బ్యాటరీతో నడిచే ఈ-స్కూటర్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ రూ. 1.30 లక్షలు ఎక్స్-షోరూమ్ కాగా, ధర తగ్గింపు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్‌లో భాగంగా కంపెనీ ఈ స్కూటర్‌ను దాని అసలు ధర నుండి రూ.10,000 నుండి రూ.12,000 వరకు డిస్కౌంట్ తో విక్రయిస్తోంది.

అయితే ఈ ఆఫర్ ఖచ్చితమైన సమయాన్ని బజాజ్ ఇంకా వెల్లడించలేదు. 2020 సంవత్సరంలో, కంపెనీ తన చేతక్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ అవతార్‌లో మళ్లీ లాంచ్ చేసింది. కస్టమర్ బేస్ పరిమితం అయినప్పటికీ. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రాబోయే రోజుల్లో టైర్ 2, టైర్ 3 నగరాలకు తీసుకెళ్లాలని కంపెనీ ఆలోచిస్తోంది. కాగా ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రష్‌లెస్ డీసీ మోటార్‌తో ఆధారితమైనది, ఇది 4.08 kW గరిష్ట శక్తిని16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 60.3Ah కెపాసిటీ కలిగిన లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌తో ఎకో మోడ్‌లో 108 కి.మీల రేంజ్‌ను అందించగలదని కంపెనీ వెల్లడించింది.

సాంప్రదాయ 5A పవర్ సాకెట్‌ని ఉపయోగించి, ఈ స్కూటర్ బ్యాటరీని 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒక గంట సేపు చార్జింగ్ చేస్తే 25 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. కాగా ఫీచర్ల పరంగా, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ LED లైటింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాప్ ఆధారిత నోటిఫికేషన్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని పొందుతుంది. హార్డ్‌వేర్ పరంగా, ఇది సింగిల్-సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ మోనోషాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ డ్రియర్ డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది.