Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో 349సీసీ ఇంజిన్ ఉంటుంది. బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.76 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్‌పై 28 శాతం జీఎస్‌టీ పన్ను ఉంది. ఈ జీఎస్‌టీ పన్నును 10 శాతం తగ్గించినట్లయితే ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 17,663 లాభం కలుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Bullet 350

Bullet 350

Bullet 350: కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లలో మార్పులు చేసింది. దీని వల్ల ప్రజలకు దీపావళికి ముందే ఒక పెద్ద బహుమతి లభించింది. జీఎస్‌టీ కోత తర్వాత కార్లు, మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గుతున్నాయి. దీంతో ఇప్పుడు వాటిని కొనుగోలు చేయడం కాస్త సులభం కానుంది.

కొత్త జీఎస్‌టీ మార్పుల ప్రకారం.. 350సీసీ వరకు ఉన్న స్కూటర్లు, బైక్‌ల ధరలు ఇప్పుడు తగ్గుతాయి. అయితే 350సీసీ కంటే ఎక్కువ ఉన్న బైక్‌ల ధరలు పెరుగుతాయి. బైక్‌లపై జీఎస్‌టీని 28% నుంచి 18%కి తగ్గించనున్నారు. ఈ జీఎస్‌టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350ని (Bullet 350) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ బైక్ మీకు ఎంత చౌకగా లభిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

బైక్ ధర ఎంత తగ్గుతుంది?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో 349సీసీ ఇంజిన్ ఉంటుంది. బుల్లెట్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.76 లక్షలు. ప్రస్తుతం ఈ బైక్‌పై 28 శాతం జీఎస్‌టీ పన్ను ఉంది. ఈ జీఎస్‌టీ పన్నును 10 శాతం తగ్గించినట్లయితే ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 17,663 లాభం కలుగుతుంది.

Also Read: GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 320 పవర్, మైలేజ్

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది.
  • ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్, 4,000 rpm వద్ద 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ మోటార్‌సైకిల్ ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ కాన్‌స్టాంట్ మెష్ గేర్ బాక్స్ కూడా ఉంది.
  • ఈ బైక్ 35 kmpl మైలేజ్ ఇస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు.
  • ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే, ఈ మోటార్‌సైకిల్ సుమారు 450 కిలోమీటర్లు ప్రయాణించగలదు.

బైక్ భద్రతా ఫీచర్లు

  • రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు వైపు డిస్క్, వెనుక వైపు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
  • భద్రత కోసం ఇందులో ఏబీఎస్ సిస్టమ్ అందించారు. మిలిటరీ వేరియంట్‌లో సింగిల్ ఛానల్, బ్లాక్ గోల్డ్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది.
  • బుల్లెట్ 350 రంగులలో మిలిటరీ రెడ్, బ్లాక్, స్టాండర్డ్ మెరూన్, బ్లాక్ గోల్డ్ ఉన్నాయి.
  Last Updated: 06 Sep 2025, 09:18 PM IST