Site icon HashtagU Telugu

Honda WR-V: స్టైలిష్ లుక్, అద్భుతమైన స్పెసిఫికేషన్లు.. అదిరిపోయిందిగా!

Honda Cars

Honda Wr V

జపాన్ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఆటోమొబైల్ సంస్థ తాజాగా సరికొత్తగా తన ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో ఒకటైన హోండా WR-V ని మార్కెట్ లోకి ప్రవేశపెడుతోంది. దీని ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్, స్లిమ్ హెడ్ లైట్స్ కొత్త హోండా WR-V ఇంత స్టైలిష్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మోడల్స్ తో పోల్చుకుంటే ఈ సరికొత్త హోండా WR-V 4,060mm పొడవు, 1,780mm వెడల్పు, 1,608mm in ఎత్తుతో లభించనుంది. దీని ప్రకారం చూసుకుంటే ప్రస్తుత మార్కెట్లో ఉన్న మోడల్ తో పోలిస్తే ఇది 60mm ఎక్కువ పొడవు, 46mm ఎక్కువ వెడల్పు, 7mm ఎక్కువ ఎత్తుతో దీనిని రూపొందించారు.

కాగా ఈ సరికొత్త WR-V ఎస్ యూవీ ని తాజాగా నవంబర్ 2న ఆవిష్కరించారు. గత మోడల్ తో పోలిస్తే దీన్ని టెక్నాలజీ పరంగా, సేఫ్టీ పరంగా ఆధునీకరించారు. అలాగే, ఈ మోడల్ గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా పెంచారు. కొత్త మోడల్ గ్రౌండ్ క్లియరెన్స్ అట్ 220mmగా ఉండడంతోపాటు 16 ఇంచ్, 17 ఇంచ్ లుగా రెండు అలాయ్ వీల్ సైజ్ లను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఈ కొత్త మోడల్ లో లెదర్ సీట్లను, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ కలర్ స్కీమ్స్ తో అందించనున్నారు. అయితే గతంలో 367 లీటర్లు మాత్రమే ఉన్న ఈ మోడల్ ఇప్పుడు 380 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

అదేవిధంగా కీ ని ఉపయోగించకుండానే లాక్, అన్ లాక్ చేసుకునే రిమోట్ ఫంక్షనింగ్ కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రిమోట్ గా ఇంజిన్ ను ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా కూలింగ్ సిస్టమ్ కూడా ఆన్ అవుతుంది. ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్ కంపెనీలకు లకు పోటీగా ఈ SUV ని మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు.

Exit mobile version