Honda Offers: హోండా కార్లపై మాన్ సూన్ డీల్స్.. పూర్తి వివరాలివే?

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వర్షాకాల సీజన్ ను పురస్కరించుకుని హోండా మ్యాజికల్ మాన్సూన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల అనగా

  • Written By:
  • Updated On - July 3, 2024 / 02:58 PM IST

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వర్షాకాల సీజన్ ను పురస్కరించుకుని హోండా మ్యాజికల్ మాన్సూన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల అనగా జూలై 1 నుంచి 31 వరకు జరిగే ఈ నెల రోజుల పాటు జరిగే ప్రమోషన్ లో భాగంగా ఏదైనా హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు, సర్ ప్రైజ్ బహుమతులను కూడా అందిస్తోంది. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని అధీకృత హోండా డీలర్ షిప్ ల్లో ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఈ క్యాంపెయిన్ వర్షాకాలంలో కార్ల కొనుగోలును మరింత లాభదాయకంగా మార్చాలని హోండా కార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మాన్సూస్ ఆఫర్స్ అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఇ:హెచ్ఇవి హైబ్రిడ్ వేరియంట్ సహా హోండా లైనప్ లోని అన్ని కార్లకు వర్తిస్తాయి. కాగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు అన్ని హోండా కార్లపై పొందవచ్చు. అదనంగా, రూ .75,000 వరకు విలువైన బహుమతులను కూడా పొందవచ్చు. జూలై 1 నుంచి జూలై 31 వరకు ప్రచార కాలంలో నిర్వహించే టెస్ట్ డ్రైవ్ ల్లో కూడా ఆశ్చర్యకరమైన బహుమతులను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. అయితే హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ జూన్ 2024 లో ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది. దేశీయ అమ్మకాలు 2023 జూన్ లో విక్రయించిన 5,080 యూనిట్లతో పోలిస్తే 5 శాతం తగ్గి 4,804 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

అలాగే మే 2024 లో కూడా అంతకుముందు సంవత్సరం మే నెల అమ్మకాల కన్నా తక్కువే నమోదయ్యాయి. మే నెలలో దేశీయ అమ్మకాలు 4,822 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతుల్లో హోండా కార్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 జూన్ లో 2,112 యూనిట్ల ను ఎగుమతి చేయగా, 2024 జూన్ లో 4,972 యూనిట్లను ఎగుమతి చేసింది. అంటే దాదాపు 135 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు ఇది సానుకూల సంకేతం. నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే దేశీయ అమ్మకాలు, ఎగుమతులు స్వల్పంగా క్షీణించాయి. 2024 మేలో 6,521 యూనిట్లను ఎగుమతి చేయగా, దేశీయ అమ్మకాలు 4,822 యూనిట్లుగా ఉన్నాయి. అందుకే ఈసారి కాస్త వినుత్నంగా ఆలోచించి వినియోగదారులకు ఆ బహుమతులు కూడా అందిస్తోంది.