Honda NX500 Bike: మార్కెట్ లోకి విడుదల కొత్త హోండా NX500.. బుకింగ్స్ ఓపెన్?

ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త NX500 అడ్వెంచర్ టూరర్‌ బైక్ లాంచ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ అద్భుతమైన ఫీచర్స

  • Written By:
  • Publish Date - January 21, 2024 / 06:00 PM IST

ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త NX500 అడ్వెంచర్ టూరర్‌ బైక్ లాంచ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ బైక్ అద్భుతమైన ఫీచర్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కాగా తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసిన ఈ కొత్త బైక్ ధర రూ. 5.90 లక్షలుగా ఉంది. ఈ ఇది హోండా బైక్ కి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. కంపెనీ ప్రీమియం రిటైల్ అవుట్‌లెట్ చైన్ బిగ్‌వింగ్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ బైక్ కోసం బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయి. అలాగే ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

హోండా ఎన్ఎక్స్500 డిజైన్ ఫీచర్లు, స్టైలింగ్ పరంగా మోటార్‌ సైకిల్ మొత్తం డిజైన్ గత మోడళ్ల మాదిరిగానే ఉంటాయి. అయితే, అక్కడక్కడా కొన్ని అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇకపోతే ఈ హోండా ఎన్స్500 బైక్ ఫీచర్లు, స్పెషిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ కొత్త ఆల్-ఎల్ఈడీ హెడ్‌లైట్, కొంచెం పెద్ద ఫెయిరింగ్, పొడవైన విండ్‌స్క్రీన్, లేటెస్టుగా రూపొందించిన టెయిల్ ల్యాంప్, కస్టమైజడ్ డిస్‌ప్లే ఆప్షన్లతో 5 అంగుళాల ఫుల్-కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్‌ను పొందుతుంది. డైమండ్-ట్యూబ్ మెయిన్‌ ఫ్రేమ్ ఆధారంగా తలక్రిందులుగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ యూనిట్‌ను కలిగి ఉంటుంది.

సీబీ500ఎక్స్ బైక్ మాదిరిగానే ఈ మోటార్‌సైకిల్ 19-అంగుళాల ముందు, 17-అంగుళాల వెనుక ట్రయల్-ప్యాటర్న్ టైర్‌లపై నడుస్తుంది. ఇందులో 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీలు డ్యూయల్ 296ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్‌లు, 240ఎమ్ఎమ్ బ్యాక్ డిస్క్ ద్వారా పనిచేస్తాయి. ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా ఉంటాయి. పోల్చి చూస్తే.. సీబీ500ఎక్స్ ఆఫర్‌లో ఒకే డిస్క్ ఫ్రంట్ బ్రేక్‌ను మాత్రమే కలిగి ఉంది. హోండా ఎన్ఎక్స్500 ఇంజిన్ పవర్ ఎన్ఎక్స్500 అనేది 471సీసీగా పనిచేస్తుంది. లిక్విడ్-కూల్డ్, సమాంతర ట్విన్ ఇంజన్ కలిగి ఉంది. 47.5హెచ్‌పీ, 43ఎన్ఎమ్ పీక్ టార్క్ చేస్తుంది. మోటారు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అసిస్ట్/స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో సరికొత్త హోండా ఎన్ఎక్స్500 మోడల్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్, పర్ల్ హారిజన్ వైట్‌లతో సహా 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.