Flex Fuel Bike : దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ వచ్చేసింది. దీన్ని సీబీ300ఎఫ్ (CB300F) పేరుతో హోండా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.70 లక్షలు (ఎక్స్- షోరూమ్). దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈనెల చివరి వారం నుంచి హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో సీబీ300ఎఫ్ బైక్ అందుబాటులో ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఇంధనాలు కలిసి ఉండే మిశ్రమాలను ఫ్లెక్స్ ఫ్యూయల్ అని అంటారు. పెట్రోల్+ ఇథనాల్ లేదా మిథనాల్‌తో కూడా నడవడం ఈ బైక్ ప్రత్యేకత.
కార్బన్ ఉద్గారాలకు చెక్
ఈసందర్భంగా హోండా కంపెనీ ఎండీ, సీఈఓ సుత్సుము ఒటాని(Flex Fuel Bike) మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. మా కంపెనీ ప్రయాణంలో సరికొత్త మైలురాయిగా ఇది నిలుస్తుంది. కార్బన్ ఉద్గారాలు వాతావరణంలోకి రిలీజ్ కాకుండా నిలువరించే గొప్ప లక్ష్యంతో ఈ బైక్‌ను మా కంపెనీ తయారు చేసింది’’ అని సుత్సుము ఒటాని తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగాన్ని పుంజుకున్నాయి. పర్యావరణ పరిరక్షణకు, ఇంధన పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే సర్వీసింగ్ సంబంధిత సమస్యల వల్ల ఓలా వంటి కంపెనీల ఈవీ స్కూటర్లు, బైక్స్ సేల్స్ ఇటీవలే గణనీయంగా తగ్గాయి. వినియోగదారులకు కస్టమర్ కేర్‌ను పెంచడంతో పాటు బ్యాటరీ పేలడం వంటి వాటి నుంచి అదనపు భద్రత లభిస్తే ఈవీల సేల్స్ రెక్కలు తొడగడం ఖాయం.
Also Read :Maharashtra Elections : మహారాష్ట్ర పోల్స్.. 99 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్
హోండా CB300F బైక్ ఫీచర్లు
- ఇంజిన్: 293.52 cc (4 స్ట్రోక్)
- టార్క్: 25.6 Nm
- కెర్బ్ వెయిట్: 153 kg
- పవర్: 24.4 PS
- మైలేజ్: 30 kmpl
- బ్రేక్స్: డబుల్ డిస్క్
- గేర్ బాక్స్ : 6 స్పీడ్ గేర్ బాక్స్
- క్లచ్ : అసిస్టెంట్ స్లిప్ క్లచ్
- ఏబీఎస్ : డ్యూయల్ ఛానల్ ఏబీఎస్
- కలర్స్ : స్పోర్ట్స్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్