Site icon HashtagU Telugu

Honda Gold Wing Tour: హోండా గోల్డ్ వింగ్ టూర్ బుకింగ్ 2023

Honda Gold Wing Tour

Honda Gold Wing Tour

Honda Gold Wing Tour: హోండా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ బైక్స్ ని విక్రయిస్తోంది. హోండా ఇండియా తన సరికొత్త టూరింగ్ గోల్డ్ వింగ్ టూర్ బైక్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ లగ్జరీ ఫీచర్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దాదాపు 390 కిలోల బరువున్న ఈ గోల్డ్ వింగ్ టూర్ బైక్ 1833 సిసి లిక్విడ్ కూల్డ్ 4 స్టోక్ 24 వాల్వ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రూపొందించారు. అంతే కాకుండా ఈ బైక్ సులభంగా పార్కింగ్ చేయడానికి స్లో మోషన్ ఫంక్షనాలిటీతో అందుబాటులో ఉంది. .

ఈ బైక్‌లో ఎలక్ట్రిక్ట్‌ స్క్రీన్‌, డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫాగ్‌ లైట్స్‌, క్రూయజ్‌ కంట్రోల్‌, ఏడు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ లిక్విడ్‌ క్రిస్టల్‌డిస్‌ప్లే, స్పీకర్లు, హిల్‌స్టార్ట్‌తో పాటు మరెన్నో సదుపాయాలు ఉన్నాయి. యూపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకు ఇది సపోర్ట్‌ చేస్తుంది. అలాగే స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌ నెంబర్లు, మ్యూజిక్‌ ప్లే లిస్ట్‌ను యాక్సెస్‌ చేయవచ్చు. బ్లూటూత్‌ కనెక్టివిటితో పాటు రెండు యూఎస్‌బీ టైప్‌ సి-పోర్టులు. అంతే కాకుండా గోల్డ్ వింగ్ టూర్ బైక్‌లో వివిధ రకాల కార్ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ప్రధాన లక్షణం ఏమిటంటే ఈ బైక్‌లో ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ జత చేశారు. గోల్డ్ వింగ్ బైక్ ధర 39.2 లక్షల రూపాయలు. దీన్నిహోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు.

Also Read: RBI Extends : రూ.2 వేల నోట్ల మార్పిడి డేట్ ను పొడిగించిన RBI