Honda Elevate: మార్కెట్ లోకి హోండా సరికొత్త కారు.. తక్కువ ధరకే అధికమైలేజీ?

దేశవ్యాప్తంగా ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సం

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 07:02 PM IST

దేశవ్యాప్తంగా ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకున్న కార్ల తయారీ సంస్థలు, ప్రతి కంపెనీ ఏదో ఒక ఎస్‌యూవీని విడుదల చేయాలని ఆలోచిస్తున్నాయి. అయితే నిజానికి ఎస్‌యూవీ కొనాలని చూసేవారు మైలేజీని పెద్దగా పట్టించుకోరు. కేవలం ఆ కారులోని ప్రీమియం ఫీచర్ లపై మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే గత రెండేళ్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు ధరలు ఆకాశాన్నంటుతుండడంతో, ప్రజలు మైలేజీ గురించి చాలా సెన్సిటివ్ అయ్యారు. ఇప్పుడు పెద్ద ఎస్‌యూవీ లలో కూడా మంచి మైలేజీని పొందాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీంతో చాలా కంపెనీలు తమ కొత్త ఎస్‌యూవీ కార్లను కూడా మైలేజీని దృష్టిలో ఉంచుకొని తయారు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఇటీవల విడుదల చేసిన కొన్ని ఎస్‌యూవీ కార్లను పరిశీలిస్తే, వాటి మైలేజ్ చాలా మెరుగుపడింది. ఇప్పుడు చాలా ఎస్‌యూవీలు 15-25 kmpl మైలేజీతో వస్తున్నాయి. కాగా చాలాకాలం తర్వాత హోండా తన కారును విడుదల చేసింది. హోండా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ హోండా ఎలివేట్‌ను అతి త్వరలో భారత మార్కెట్ లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కాగా ఎలివేట్ మైలేజీ ఎంత అన్న విషయానికి వస్తే.. హోండా ఎలివేట్ , మాన్యువల్ వేరియంట్ , మైలేజ్ 15.31 kmpl , ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 16.92 kmpl గా క్లెయిమ్ చేయబడింది. ఇది హోండా ఎలివేట్ , ARAI ధృవీకరించబడిన మైలేజ్. అయితే, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి రియల్ టైమ్ మైలేజ్ మారవచ్చు. కంపెనీ ఇందులో 40 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను ఇస్తోంది.

దీని ప్రకారం ఈ ఎస్‌యూవీ ఫుల్ ట్యాంక్‌పై 676 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. అలాగే హోండా ఎలివేట్ అధునాతన ఫీచర్లతో రాబోతోంది. కంపెనీలో 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీ, యాంబియంట్ లైటింగ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, రియర్ ఏసీ వెంట్స్ , ప్రీమియం ఆడియో సిస్టమ్ ఉన్నాయి. అనేక అధునాతన ఫీచర్లను అందిస్తోంది. ఇకపోతే ధర విషయానికి వస్తే.. హోండా ఎలివేట్‌లో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తోంది. సిటీ సెడాన్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది ఒకే ఇంజన్ ఆప్షన్‌తో లాంచ్ అవుతుంది. ఈ ఇంజన్ 121PS పవర్ , 145Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ , CVT గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంటుంది. హోండా ఎలివేట్ రూ. 10 నుండి 17 లక్షల ధరతో విడుదల చేయవచ్చని సమాచారం. అయితే ప్రస్తుతం రూ.20,000తో బుక్ చేసుకోవచ్చు.