Honda Cars: భారీగా హోండా కార్ల ధరలు పెంపు

వాహన తయారీ సంస్థ హోండా (Honda Cars) కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2023 నుంచి కంపెనీకి చెందిన అన్ని హోండా కార్ల (Honda Cars) ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 06:25 PM IST

వాహన తయారీ సంస్థ హోండా (Honda Cars) కూడా తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 2023 నుంచి కంపెనీకి చెందిన అన్ని హోండా కార్ల (Honda Cars) ధరలు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. జనవరి నుంచి తమ కార్ల ధరలను రూ.30,000 వరకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి ముందు కూడా చాలా కారు కంపెనీలు జనవరి 2023 నుండి తమ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

మోడల్‌ను బట్టి పెంపు రూ.30,000 వరకు ఉంటుందని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌, మెర్సిడెస్‌ బెంజ్‌, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్‌ సంస్థలు కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ లిస్ట్‌లో హోండా కూడా చేరింది. ఏప్రిల్‌ 2023 నుంచి వాహన తయారీ సంస్థలు బీఎస్‌-6 (BS-IV) రెండో దశ ఉద్గార ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంది.

Also Read: Dasari Kiran Kumar: టీటీడీ బోర్డు సభ్యుడిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం

వాస్తవానికి జనవరి 2023 నుండి వాహనాల ధరలు పెరగనున్నాయి. అయితే డిసెంబర్‌లో లభించే కారు డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో 14 రోజులు మిగిలి ఉన్నాయి. డిసెంబర్‌లో కస్టమర్‌లు తమ వాహనాలపై రూ. 72,000 వరకు ఆదా చేసుకునేందుకు హోండా కంపెనీ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.