Site icon HashtagU Telugu

Honda Offers: యూజర్లకు బంపర్ ఆఫర్ ను ప్రకటించిన హోండా.. అవకాశం అప్పటివరకు అంటూ!

Honda Offers

Honda Offers

దేశవ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్లు బైకులలో ఎక్కువ శాతం హోండా కంపెనీకి చెందినవే ఉంటున్నాయి. ఈ హోండా బైక్స్ కి స్కూటీ కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. అయితే ఈ డిమాండ్ ను మరింత స్థిరపరుచుకోవడం కోసం హోండా ఎప్పటికప్పుడు గట్టిగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లను అస్త్రంగా వాడుకొని వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు హోండా షైన్ 100, హోండా యాక్టివా వాహనాలపై అదిరే ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో క్యాష్ బ్యాక్, మెయింటెనెన్స్ ప్యాకేజీ, ఎక్స్ టెండెడ్ వారంటీ వంటివి ఉన్నాయి.

పైగా ఈ ఆఫర్లు సెప్టెంబర్ నెలాఖరు వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.. ఇంతకీ ఆ ఆఫర్లు ఏంటి అన్న విషయానికొస్తే.. హోండా యాక్టివా, హోండా షైన్ 100 వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు ప్రతి కొనుగోలుపై 5శాతం క్యాష్ బ్యాక్ రూ. 5000 వరకూ అందిస్తోంది. అంతేకాకుండా ఒక సంవత్సరం పాటు మెయింటెనెన్స్ ప్యాకేజీని ఉచితంగా అందిస్తోంది. అలాగే యాక్టివా స్కూటర్ పై మూడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీ, షైన్ 100 బైక్ పై ఏడేళ్ల ఎక్స్‌టెండెడ్ వారంటీని ఇస్తోంది. అయితే ఈ ఆఫర్లు కేవలం సెస్టెంబర్ నెల ఎండ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కస్టమర్లు హోండా అథరైజ్డ్ డీలర్ వద్ద సంప్రదించాలని హోండా సూచించింది. కాగా హెూండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఆగస్టు మాసంలో స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేసింది. మొత్తం డిస్పాచ్లు 5,38,852 యూనిట్లకు చేరుకున్నాయని, ఇది సంవత్సరానికి 13 శాతం వృద్ధిని సూచిస్తోందని కంపెనీ ప్రకటించింది. ఈ మొత్తంలో దేశీయ విక్రయాలు 4,91,678 యూనిట్లు కాగా ఎగుమతులు మొత్తం 47,174 యూనిట్లు ఉన్నాయి. ఈ నెలలో దేశీయ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 9 శాతం పెరిగాయి. గడిచిన ఏడాదిలతో పోల్చుకుంటే హోండా తన విక్రయాలను అంతకంతకు పెంచుకుంటూ పోతోంది.