Site icon HashtagU Telugu

Hero Vida V1 Plus: సరసమైన ధరలోనే హీరో సరికొత్త స్కూటర్.. సింగిల్ చార్జ్ తో అన్ని కి.మీ ప్రయాణం!

Mixcollage 03 Mar 2024 03 55 Pm 4325

Mixcollage 03 Mar 2024 03 55 Pm 4325

హీరో మోటాకార్ప్ సంస్థ మార్కెట్ లోకి రీలాంచ్ చేసింది. దాని పేరు విడా వీ1 ప్లస్. దీని ధర రూ.1,15,000గా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న హీరో వీ1 ప్రో స్కూటర్ కంటే రూ.30 వేలు తక్కువకే అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి వస్తే.. హీరో మోటాకార్ప్ సంస్థ విడా వీ1 ప్లస్ స్కూటర్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఫేమ్ పథకం రెండో విడత సబ్సిడీతో కలిపి దీని ధరను రూ.1,50,000గా నిర్ణయించింది. ఈ స్కూటర్ లో పోర్టబుల్ చార్జర్ సౌకర్యం కూడా ఉంది.

విడా వీ1 ప్రో కంటే రూ.30 వేలు తక్కువ ధరతో పాటు వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు వంద కిలోమీటర్ల వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరగవచ్చు. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. జాతీయ రహదారులపై కూడా దూసుకుపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న సబ్సిడీలను అనుసరించి ఈ బండి ధర మరింత తక్కువకు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు న్యూఢిల్లీలో అయితే రూ.97,800కు లభిస్తోంది.
కాలుష్యాన్ని నివారించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా అనేక రాయితీలు ప్రవేశపెట్టింది.

ఎలక్ట్రిక్ వాహనాలను కోనుగోలు చేసే వారికే వాటి ద్వారా సబ్సిడీలు కల్పించి, తక్కువ ధరకే అందజేస్తోంది. అలా ప్రవేశ పెట్టిందే ఎఫ్ఏఎమ్ఐ పథకం. దీనికి కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించింది. వీ1 ప్లస్, వీ1 ప్రో రెండు స్కూటర్లూ 6 కేడబ్ల్యూ ఎలక్టిక్ మోటారుతో పనిచేస్తాయి. ఈ రెండింటి గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. కేవలం మూడు, నాలుగు సెకండ్లలోనే దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. పూర్తి ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ ఈడీ లైటింగ్, మల్టిపుల్ రోడ్ మోడ్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ తదితర సౌకర్యాలు ఉన్నాయి. హీరో మోటోకార్ప్ 1,494 ఎలక్ట్రిక్ టూ వీలర్లతో ఈ ఏడాదిని ప్రారంభించింది. అయితే ఆ నెలలో అమ్మకాలలో 6.46 శాతం తగ్గుదల నమోదైంది.

కానీ ఫిబ్రవరిలో అమ్మకాలు జోరందుకున్నాయి. దాదాపు 1,750 యూనిట్లకు చేరాయి. మొదట్లో స్కూటర్ల అమ్మకాలు అనుకునంత విధంగా లేనప్పటికీ జూలై నాటికి బాగా పుంజుకున్నాయి. ఇక సెప్టెంబర్ లో 3 వేల మైల్ స్టోన్ కు చేరి రికార్డు నెలకొల్పాయి. అమ్మకాల్లో ఈ ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కంపెనీ భావించింది. వినియోగదారులకు మరింత అనుకూలంగా చేయాలని నిర్ణయించింది.

Exit mobile version