హీరో మోటో కార్ప్ బైకులకు ఉన్న క్రేజ్ డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ద్విచక్ర వాహన వినియోగదారులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే బైక్స్ లో హీరో బైక్స్ కూడా ఒకటి. అయితే ఇప్పటికే చాలా రకాల బైక్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా కొత్త ఫీచర్ తో కూడిన కొత్త స్ప్లెండర్ బైకును హీరో కంపెనీ ఇటీవలె మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఇటీవల విడుదల చేసిన ఈ బైక్ కి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో అప్‌డేట్ చేసిన స్ప్లెండర్ చాలా సరసమైన ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.83,461 గా ఉంది.
ఈ డిస్క్ బ్రేక్ ఫీచర్ స్ప్లెండర్ ప్లస్ XTEC వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ బైక్‌లో 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7.9 బిహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 4-స్పీడ్ గేర్ బాక్స్‌ను కూడా పొందుతుంది. కొత్త మోటార్ సైకిల్ బ్లాక్ స్పార్క్లింగ్ బ్లూ, బ్లాక్ టోర్నాడో గ్రే, బ్లాక్ రెడ్ అనే 3 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, I3S స్టార్ట్ స్టాప్ సిస్టమ్. బైక్‌లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ వెనుక 130 డ్రమ్ బ్రేక్ సిస్టమ్‌తో ముందు 240 mm డిస్క్ బ్రేక్‌ను పొందుతుంది.
ఇందులో IBS కూడా ఉంది. ఇది ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక వైపున 5 దశల సర్దుబాటు చేయగల డ్యూయల్ షాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంది. కాగా ఈ హీరో గ్లామర్ కొత్త రంగుతో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉంది. బైక్ బ్లాక్ మెటాలిక్ సిల్వర్ అనే అద్భుతమైన రంగు ఎంపికలో ఉంది. ఈ కొత్త రంగుతో కూడిన డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 83,598 కాగా డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 87,598 గా ఉంది.. హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ కూడా కలదు. ఇది 55 kmpl వరకు మైలేజీని అందజేస్తుందని కంపెనీ తెలిపింది. LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.