Hero Splendor Electric: మార్కెట్లోకి విడుదల కాబోతున్న హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్.. పాత బైకే కానీ!

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ రేంజ్ లో క్రేజ్ డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారు

  • Written By:
  • Publish Date - January 22, 2024 / 04:00 PM IST

ప్రస్తుత రోజుల్లో మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఏ రేంజ్ లో క్రేజ్ డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాంతో మార్కెట్ లోకి కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే గత ఏడాది ఎన్నో రకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఉన్న పలు టాప్ బ్రాండ్ల మొడళ్లు కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిల్లో హీరో స్ల్పెండర్ ఒకటి. హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ త్వరలో మార్కెట్లోకి రానుంది.

ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. పూణేలో పరీక్షీస్తుండగా ఇది కెమెరా కంటికి చిక్కింది. ఇదే క్రమంలో మొత్తం ఎలక్ట్రిక్ బైక్ నే కొనుగోలు చేయకుండా ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బైక్ లనే సులభంగా ఎలక్ట్రిక్ బైక్ గా మార్చేసే కిట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇది మన దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ కిట్ సాయంతోనే హీరో స్ల్పెండర్ ఎలక్ట్రిక్ వేరియంట్ ను తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. గోగోఏ1.. మన దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వాటిల్లో ప్రధానంగా గోగోఏ1 బ్రాండ్ నేమ్ బాగా వినిపిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ బ్రాండ్ కాదు. ఇది ఏం చేస్తుందంటే కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయకుండా ఇప్పటికే ఉన్న ఐసీఈ అంటే పెట్రోల్ ఇంజిన్ బైక్ ను సులభంగా ఎలక్ట్రిక్ గా మార్చేస్తుంది.

కేవలం ఒక్క కిట్ సాయంతో ఇది దానిని ఎలక్ట్రిక్ వేరియంట్ గా మార్చేస్తుంది. ద్విచక్ర వాహన ఈవీల రంగంలో గోగోఏ1 చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. విభిన్నంగా ఆలోచించింది. కొత్త ఎలక్ట్రిక్ వేరియంట్ వాహనాలు మార్కెట్లోకి తీసుకొని రావడం కంటే ప్రస్తుతం ఉన్న పెట్రోల్ ఇంజిన్ వాహనాలను ఎలక్ట్రిఫై చేయడంపై దృష్టి పట్టింది. అది కూడా చాలా సులభంగా. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా ఈ గోగోఏ1 కిట్ సాయంతోనే హీరో స్ల్పెండర్ ను పూణేలో పరీక్షించినట్లు తెలుస్తోంది. కాగా పూణేలో గుర్తించిన ఎలక్ట్రిక్ హీరో స్ప్లెండర్ ప్రోటోటైప్ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ మోటారుసైకిల్ ఎరుపు రంగులో, తాత్కాలిక నంబర్ ప్లేట్తో మొత్తం పూర్తిగా సంప్రదాయ ఇంధన బైక్ లా కనిపిస్తోంది. ఎందుకంటే దీని సీటు, వెనుక గ్రాబ్ రైల్ డిజైన్, ఇతర లక్షణాలుఅన్ని కూడా పాత మోడల్ లాగానే కనిపిస్తోంది. దీనిని కేవలం పరీక్షల కోసమే ఇలా తయారు చేసి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ధర ఎంత ఉండవచ్చు అన్న విషయానికి వస్తే.. ప్రస్తుతం స్ప్లెండర్ కోసం గోగోఏ1 తయారు చేసిన ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ కు ఏఆర్ఏఐ ఆమోదం పొందింది. అలాగే పేటెంట్ కూడా పొందింది. దీంతో ఈ మోటార్‌సైకిల్ కన్వర్షన్ కిట్‌ను రూ. 29,000కు కొనుగోలు చేయవచ్చు. అయితే హీరో మోటోకార్ప్, హోండాతో సహా 45 వేర్వేరు వాహనాలకు ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లను అందిస్తూ ఉండటంతో ఈ ధరలో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటాయేమో చూడాలి మరి.