Site icon HashtagU Telugu

Hero Xtreme 160R: మరో సూపర్ బైక్ ని విడుదల చేసిన హీరో.. ఫీచర్స్ మామూలుగా లేవుగా!

Hero Xtreme 160r

Hero Xtreme 160r

భారత మార్కెట్ లోకి ఇటీవల కాలంలో సూపర్ ఫీచర్స్ కలిగిన ఎన్నో రకాల బైక్స్ విడుదలైన విషయం తెలిసిందే. ఒకదానిని మించి ఒకటి అత్యాధునిక ఫీచర్లు కలిగిన బైక్స్ మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఇకపోతే భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలోని బైక్ మార్కెట్‌లో హీరో కంపెనీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్న విషయం తెలిసిందే. బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్‌ లతో పాటు యువతను ఆకట్టుకునేందుకు తక్కువ ధర లోనే సూపర్ బైక్స్‌ ను హీరో కంపెనీ లాంచ్ చేస్తూ ఉంటుంది. తాజాగా హీరో కంపెనీ హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీని భారతదేశం అంతటా సింగిల్ డిస్క్ వేరియంట్‌ లో లాంచ్ చేసింది.

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ బైకుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఈ బైక్ ధర రూ. 1,11,111 గా ఉంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ ప్రత్యేకమైన జోడింపుల్లో ఒకటిగా సెగ్మెంట్ మొదటి డ్రాగ్ రేస్ టైమర్‌ తో వస్తుంది. ఈ వినూత్న ఫీచర్ రెండు విభిన్న మోడ్‌ లతో వస్తుంది. ముఖ్యంగా డీ1, డీ2 ఫీచర్లు బైక్‌ ను వేగంగా నడిపే రేసర్ లకు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్‌ తో వస్తుంది. ముఖ్యంగా ప్రీమియం డిజైన్, విలక్షణమైన హెచ్ గుర్తు బైక్ ప్రియులను మరింతగా ఆకర్షిస్తాయి. ఈ అప్‌డేట్‌ లో రైడర్ కంఫర్ట్‌ కు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. పిలియన్ సీటును తక్కువ ఎత్తుతో రీ డిజైన్ చేశారు.

రైడర్లు చాలా సురక్షితంగా రైడ్ చేయవచ్చు. వెనుక వైపు గ్రిప్ స్పాన్‌ ఉండడం వల్ల రైడర్, పిలియన్ ఇద్దరూ మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ప్రస్తుతం హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్ 2వీ బైక్ ప్రత్యేకంగా స్టీల్ బ్లాక్‌ లో అందుబాటులో ఉంది. ఈ కొత్త వేరియంట్ అత్యాధునిక లుక్‌ తో సూపర్ స్టైలిష్ ఫీచర్స్‌ తో వస్తుంది. కాగా తాజాగా విడుదల చేసిన ఈ బైక్ కు సంబంధించి ఇంకా ఫీచర్లు వివరాలు తెలియాల్సి ఉంది.