Site icon HashtagU Telugu

Hero e-scooter: మార్కెట్ లోకి హీరో నుంచి మరో ఈ స్కూటర్.. ఇదే చీపెస్ట్ అంటూ!

Mixcollage 23 Jul 2024 12 32 Pm 8789

Mixcollage 23 Jul 2024 12 32 Pm 8789

దేశవ్యాప్తంగా హీరో కంపెనీ నుంచి విడుదలయ్యే ద్విచక్ర వాహనాలకు ఉన్న ఆదరణ గురించి మనందరికీ తెలిసిందే. నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు వినియోగదారుల మనసులను గెలుచుకుంటూ ప్రజలు ఇష్టపడే సరసమైన ధరల్లో ఉండే బైకులను విడుదల చేస్తోంది హీరో సంస్థ. దీంతో వాహన వినియోగదారులు కూడా ఈ హీరో కంపెనీ నుంచి అప్పుడప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదల అవుతాయా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగిపోతుండడంతో హీరో సంస్థ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ఫోకస్ పెట్టింది. అనేక మోడళ్ల ఈవీలను తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఈవీల రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది. అందరికి అందుబాటులో ధరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఈ ఏడాది విడుదల చేయాలని హీరో కంపెనీ సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అలా ఈ ఏడాది కొత్త ఈవీ వేరియంట్ ను విడుదల చేసే అవకాశం ఉందట. మార్కెట్ లో అమ్మకాలను పెంచుకోనే వ్యూహంలో భాగంగానే తక్కువ ధరకు కొత్త స్కూటర్ ను అందుబాటులోకి తీసుకురానుంది హీరో. అయితే కొత్త స్కూటర్ ను విడుదల చేయడంతో ద్వారా హీరో కంపెనీ తన వాహన శ్రేణిని విస్తరించి, మార్కెట్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా మధ్య శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ప్రజలకు పరిచయం చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తోంది.

అయితే హీరో కంపెనీ విడుదల చేసే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ప్రస్తుతం విడా వీవన్ ప్లస్ లో 3.44 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ ను ఉంది. అయితే కొత్త స్కూటర్ కు చిన్న బ్యాటరీ ప్యాక్‌ ఏర్పాటు చేస్తారని సమాచారం. దీని వల్ల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలాగే కొన్ని ఫీచర్లను కూడా తొలగించే అవకాశం కూడా ఉంది. కానీ ప్రొడెక్షన్ మోడల్ విడుదలైన తర్వాతే ఈ విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. ప్రస్తుతం ఇవి వాహనాల్లో ఓలా ఎస్ వన్ ఎక్స్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాలలో బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి చేరడానికి హీరో కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అందుకు తక్కువ ధరకు ఈవీ విడుదల చేయడానికి చర్యలు తీసుకుంది.