Hero Moto Corp: ఒకేసారి 5 రకాల బైక్స్ ని విడుదల చేస్తున్న మోటో కార్ప్.. పూర్తి వివరాలు ఇవే?

భారత్లో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ అయినా హీరో మోటోకార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన బైకులను

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 06:30 PM IST

భారత్లో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ అయినా హీరో మోటోకార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల అద్భుతమైన బైకులను విడుదల చేసింది మోటోకార్ప్. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మోటార్‌ సైకిళ్లు, స్కూటర్‌ లను భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ఆలోచిస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో మార్కెట్లోకి 5 టూవీలర్ల విడుదల చేయబోతోంది మోటోకార్ప్. ఆ వివరాల్లోకి వెళితే..

Hero Xtreme 160R.. ఈ బైక్ జూన్ 14న భారత్ లోకి విడుదలైన విషయం తెలిసిందే.హీరో కొత్త Xtreme 160R ఫ్రంట్ ఫోర్క్స్ , బ్లూటూత్ కనెక్టివిటీతో అప్‌డేట్ చేయబడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌,163సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్, ఎయిర్ కూల్డ్, 4 వాల్వ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను ఇందులో ఉంటుంది.

Hero Xoom 125.. కాగా హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో Xoom 110ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ దీనిని 125సీసీ అవతార్‌లో కూడా త్వరలో విడుదల చేయనుంది. రాబోయే Hero Xoom 125 స్కూటర్ 124.6సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ తో శక్తినిచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 9 బిహెచ్‌పి పవర్,10.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Hero Xtreme 200S 4V.. హీరో మోటోకార్ప్ ఏకైక ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్‌ సైకిల్ త్వరలో కొత్త 4 వాల్వ్ మోటార్‌ తో పరిచయం చేయబోతోంది. ఇది 199.6సీసీ, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్, ఫోర్ స్ట్రోక్, ఫోర్ వాల్వ్ ఇంజిన్‌ను పొందుతుంది, ఇది 18.9 bhp , 17.35 Nm, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఈ ఇంజన్ Xpulse 200 , Xpulse 200T లకు కూడా శక్తినిస్తుంది.

Hero Karizma XMR 210.. ఈ పాపులర్ బైక్‌ను కొత్త లుక్ తో మళ్లీ మార్కెట్‌లోకి విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. సరికొత్త Hero Karizma XMR 210ని కంపెనీ ఇప్పటికే డీలర్ ఈవెంట్‌లో ప్రదర్శించింది. త్వరలో అధికారికంగా లాంచ్ చేయబోతోంది. దీని పవర్‌ ట్రెయిన్ వివరాలు ఇంకా తెలియనప్పటికీ, కరిజ్మా XMR 210 లిక్విడ్ కూల్డ్ ఇంజన్, డ్యూయల్ ఛానల్ ABS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన వాటిని పొందవచ్చని భావిస్తున్నారు.

Hero-Harley-Davidson X 440.. ఈ బైక్ హీరో మోటోకార్ప్, హార్లే-డేవిడ్‌సన్ భాగస్వామ్యంతో నిర్మించబడుతోంది. ఇది జూలై 5, 2023న విడుదల కానుంది. హార్లే X440 భారతదేశంలో ఎంట్రీ-లెవల్ రోడ్‌స్టర్‌గా ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 లక్షల లోపే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350, జావా పెరాక్, యెజ్డీ రోడ్‌స్టర్‌లకు పోటీ పడుతుందని అంతా భావిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ప్రీమియం బైక్స్ అన్నిటికీ కూడా ఇది పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు.