ప్రస్తుత రోజుల్లో టూ వీలర్ ల వాడకం ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజు రోజుకీ ద్విచక్ర వాహనాల వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాంతో అందుకు అనుగుణంగానే ద్విచక్ర వాహన తయారీ సంస్థలు టూ వీలర్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం భారత మార్కెట్ లో టూ వీలర్ బైక్స్‌లో అత్యధిక ఆదరణ పొందిన బైక్స్ లో కంపెనీ బైక్స్ కూడా ఒకటి.
అయితే గతంలో హోండా కంపెనీ భాగస్వామ్యంతో బైక్స్ లాంచ్ చేసిన హీరో కంపెనీ చాలాకాలం నుంచి సొంతంగా లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మార్కెట్‌లో ఉన్న హీరో హోండా స్ప్లెండర్ అంటే చాలా క్రేజ్ కలిగిన బైక్. ఆ తరువాత హోండా నుంచి విడిపోయాక హీరో స్ప్లెండర్ + XTEC 2.0 పేరుతో లాంచ్ అయింది.
మైలేజ్ అత్యధికంగా ఇస్తుండటంతో ఆదరణ లభిస్తోంది. ఈ బైక్ లీటరు పెట్రోల్‌పై ఏకంగా 73 కి.మీ ప్రయాణిస్తుంది. ఈ బైక్ 100 సిసి ఇంజన్, 7.9 బీహెచ్‌పి వపర్, 70 వేల కిలో మీటర్ల వారంటీతో వస్తోంది. 6000 కిలోమీటర్ల వరకూ ఎలాంటి సర్వీస్ అవసరం లేదని హీరో కంపెనీ చెబుతోంది. హీరో స్ప్లెండర్ + XTEC 2.0 బైక్‌లో డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ కాలింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. హెజార్డ్ లైటింగ్, సైడ్ ఇంజన్ కటాఫ్ ఉన్నాయి. ఈ భైక్ మార్కెట్ ధర రూ.82,911 ఉంది.