Hero HF Deluxe 2023: మార్కెట్ లోకి హీరో నుంచి మరో కొత్త బైక్.. ఫీచర్స్, ధర మాములుగా లేవుగా?

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హీరో మోటో కార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. బైక్‌ల విక్రయాలలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇ

  • Written By:
  • Publish Date - June 4, 2023 / 07:45 PM IST

భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయినా హీరో మోటో కార్ప్ గురించి మనందరికీ తెలిసిందే. బైక్‌ల విక్రయాలలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా హీరో మోటోకార్ప్ సరికొత్త బైక్ మోడల్‌ని తీసుకువచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ న్యూ మోడల్‌ను విడుదల చేసింది. 2023 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ మోడల్, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ. 60,760 గా ఉంది. కొత్త మోడల్‌ను కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌లో విడుదల చేసింది సంస్థ.

కాగా ఈ బైక్ మనకు నెక్సస్ బ్లూ, క్యాండీ బ్లేజింగ్ రెడ్, హెవీ గ్రే, బ్లాక్ స్పోర్ట్ రెడ్ వంటి కలర్స్ లో లభించనుంది. ఇకపోతే ఈ కొత్త బైక్ ఫీచర్ ల విషయానికి వస్తే.. కొత్త హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లో హీరో కంపెనీ ఈసారి అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను అసెంబుల్ చేసింది. ట్యూబ్‌లెస్ టైర్‌తో పాటు అలోయ్ వీల్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, టాయ్ గార్డ్ సౌకర్యాలు ఉన్నాయి. హాలోజన్ లైటింగ్స్, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ సౌకర్యాలతో పాటు, కొత్త బైక్ 805 మి.మీ సీట్ ఎత్తుతో 112 కిమీ బరువును కలిగి ఉంది. కాగా ఈ బైక్ ఇంజిన్, మైలేజ్ విషయానికి వస్తే..

హీరో మోటోకార్ప్ కొత్త బైక్‌ను BS6 స్టేజ్ II నిబంధనలకు అనుగుణంగా ఉండే ఇంజిన్‌తో అమర్చింది. కొత్త టెక్నాలజీ స్ఫూర్తితో 97.2 cc ఇంజిన్ మోడల్ 7.9 హార్స్ పవర్, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కొత్త బైక్‌లో, అప్‌డెటెడ్ ఇంజిన్‌తో పాటు, హీరో కంపెనీ iTriS టెక్నాలజీని ఉపయోగించింది. దీని కారణంగా కొత్త బైక్ లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 65 నుండి 70 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది.