Site icon HashtagU Telugu

Hero EV Offer: ఈవీ స్కూటర్‌పై అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా అన్ని రూ.వేల తగ్గింపుతో?

Mixcollage 20 Dec 2023 02 42 Pm 424

Mixcollage 20 Dec 2023 02 42 Pm 424

ఇటీవల కాలంలో భారత్ లో ఈవీ స్కూటర్ లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంధన ధరలు మండిపోతుండడంతో వాహన వినియోగదారులు ఎక్కువగా ఈవీ వాహనాలను ఇష్టపడుతున్నారు. ఈవీ వాహనాలు పర్యావరణ కాలుష్యం నుంచి రక్షిస్తుండడంతో ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ఈవీ స్కూటర్లపై ప్రత్యేక రాయితీలనిస్తూ ఈవీ కొనుగోలును ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాలకు అనూహ్య డిమాండ్‌ ఏర్పడింది. అయితే పెరిగిన డిమాండ్‌ మేరకు ఈవీ కంపెనీలన్నీ కొత్త మోడల్‌ స్కూటర్స్‌తో మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజా హీరో మోటోకార్ప్‌ కంపెనీ తన ఈవీ స్కూటరైన విడా వీ1 పై ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా ఈ స్కూటర్‌పై ఏకరంగా రూ.31 వేల తగ్గింపును అందిస్తుంది. మరి ఈ స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే.. హీరో విడా వీ1 స్కూటర్‌ తగ్గింపుల్లో నగదుతో పాటు లాయల్టీ తగ్గింపులు, ఎక్స్చేంజ్‌ బోనస్‌, పొడగించిన బ్యాటరీ వారెంటీ అన్ని తగ్గింపులతో కలిపి వస్తాయి. ఈ ఆఫర్లు మాత్రం ఈ నెల ఆఖరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇయర్‌ ఎండ్‌ ఆఫర్స్‌లో భాగంగా విడా వి1 ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై రూ.8259 విలువైన ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారెంటీని అందిస్తుంది. అలాగే బ్యాటరీ విలువపై రూ.5 వేల తగ్గింపునిస్తుంది.

అలాగే రూ. 5 వేల నుంచి రూ.7 వేలు లాయల్టీ తగ్గింపులతో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే రూ.2500 కార్పొరేట్‌ తగ్గింపులు కూడా ఈ స్కూటర్‌పై పొందవచ్చు. రూ.1125 విలువైన సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ కూడా ఈ స్కూటర్‌ తగ్గింపుల్లో అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ విడా వి1 స్కూటర్‌పై 5.99 శాతం తక్కువ వడ్డీ రేటుతో ఆకర్షణీయమైన ఫైనాన్స్‌ స్కీమ్‌ను కూడా పొందవచ్చు. అలాగే జీరో ప్రాసెసింగ్‌ ఫీచర్లు ఈఎంఐలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇకపోతే హీరో విడా వి1 స్కూటర్‌ ధర విషయానికి వస్తే.. హీరో విడా వి1 స్కూటర్‌ ధర రూ.1.26 లక్షలు, హీరో విడా వి1 ప్రో స్కూటర్‌ ధర రూ.1.46 లక్షలుగా ఉంటుంది. ఈ స్కూటర్‌ గంటకు 80 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 110 కిలో మీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. హీరో విడా వి1 స్కూటర్‌ 3.1 సెకన్స్‌లో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డీసీ చార్జర్‌ను ఉపయోగించి 65 నిమిషాల్లో 0-80 శాతం చార్జ్‌ అయ్యే రిమూవల్‌ బ్యాటరీతో వస్తుంది.

Exit mobile version