Site icon HashtagU Telugu

Hyundai Inster: ఆకట్టుకుంటున్న బుజ్జి ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ తో ఆకట్టుకుంటోందిగా?

Mixcollage 28 Jun 2024 12 47 Pm 75

Mixcollage 28 Jun 2024 12 47 Pm 75

తాజాగా హ్యుందాయ్ మోటార్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు ఇన్‌స్టర్ ఈవీ కార్ ని మార్కెట్ లోకి వచ్చింది. అయితే మొదట ఈ ఎలక్ట్రిక్ కారును మొదట కొరియాలో లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్ లాంటి దేశాల్లో అందుబాటులోకి రానుంది. త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ కారు 355 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇందులో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ ఉపయోగించారు. మరి ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఎక్స్‌టీరియర్ చాలా ఆకర్షణీయమైన, ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చింది. దీని దృఢమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొఫైల్ రహదారిపై బలమైన రూపాన్ని ఇస్తుంది. ఇన్‌స్టర్ ముందు, వెనుక డిజైన్‌లో హైటెక్ సర్క్యూట్ బోర్డ్-స్టైల్ బంపర్లు బోల్డ్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. ఎల్ఈడీ డీఆర్ఎల్, పిక్సెల్ గ్రాఫిక్ టర్న్ సిగ్నల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇది డ్యూయల్టోన్ ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో బ్లాక్ రూఫ్ కాంట్రాస్ట్ రంగు ఉంటుంది. అట్లాస్ వైట్, టోంబోయ్ ఖాకీ, బిజారిమ్ ఖాకీ మాట్, అన్‌బ్లేచ్డ్ ఐవరీ, సియన్నా ఆరెంజ్ మెటాలిక్, యారో సిల్వర్ మ్యాట్, డస్క్ బ్లూ మ్యాట్, అబిస్ బ్లాక్ పెర్ల్, బటర్ క్రీమ్ ఎల్లో పెర్ల్ కలర్ ఆప్షన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

అదనంగా, ఇన్‌స్టర్ వీల్ ఎంపికలలో 15 అంగుళాల స్టీల్, 15-అంగుళాల అల్లాయ్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. లోపలి భాగంలో బ్లాక్, గ్రే, బీజ్, డార్క్ బ్లూ, బ్రౌన్ కలర్ ఆప్షన్ లను ఎంచుకోవచ్చు. ఈ కలర్ ఆప్షన్లతో వినియోగదారులు తమ కారును వారి అభిరుచికి అనుగుణంగా పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఛార్జింగ్, 64-కలర్ ఎల్ఈడీ యాంబియంట్ లైటింగ్, వన్-టచ్ సన్ రూప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్ స్టర్ లాంగ్ డ్రైవింగ్ రేంజ్ దీనిని అత్యంత ప్రత్యేకమైనదిగా చేస్తుంది.అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది, తద్వారా ఇది 30 నిమిషాల్లో 10 నుండి 80 శాతం ఛార్జ్ చేయగలదు. ఈ కారు 42 కిలోవాట్ మరియు 49 కిలోవాట్ల రెండు బ్యాటరీ ఎంపికలలో వస్తుంది. అలాగే ఈ కార్ ఇది ఫ్రంట్ బెంచ్ సీటు ఎంపికను కూడా పొందుతుంది. ఇది దాని ఇంటీరియర్‌ను మరింత విశాలంగా చేస్తుంది. ఇందులో వైర్ లెస్ ఛార్జింగ్ డాక్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. భద్రత కోసం, ఇన్‌స్టర్ కు ఏడీఏఎస్ కూడా లభిస్తుంది.

Exit mobile version