Tata Nexon EV: మార్కెట్లోకి టాటా నెక్సాన్ ఈవీ కార్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గతంలో వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలిసిందే. కాగ

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 04:45 PM IST

ప్రముఖ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గతంలో వాణిజ్య అవసరాల కోసం ఎలక్ట్రిక్ వెహికల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తెలిసిందే. కాగా తాజాగా ఈ సంస్థ నెక్సాన్ ఈవీ లగ్జరీ కారును మార్కెట్‌లోకీ ప్రవేశపెట్టింది. తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో టాటా మోటార్స్ ప్రతినిధులు ఈ కారును ఆవిష్కరించారు. అయితే ఇదివరకు టాటా ఏస్ ఈవీ కమర్షియల్ వెహికల్‌ను ఈ కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెక్సాన్ ఈవీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. తాజాగా విడుదల చేసిన కారును కొత్త వర్షన్‌లోకి తీర్చిదిద్దింది.

ఈ నెల 9వ తేదీ నుంచి ఈ కారు బుకింగ్స్ ఆరంభం కానున్నాయి. అయితే మొదట 21,000 రూపాయలను చెల్లించి ఈ కారును ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. టాటా నెక్సాన్ ఈవీ ఫేస్ లిఫ్ట్ రెండు డిఫరెంట్ వేరియంట్‌లల్లో లభిస్తోంది. లాంగ్ రేంజ్, మిడ్ రేంజ్‌లల్లో ఈ కారు అందుబాటులో ఉంది. లాంగ్ రేంజ్ వేరియంట్ 40.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 465 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీని కెపాసిటీ 142 బీహెచ్‌పీ. ఎన్ఎం టార్క్‌ను విడుదల చేయగలదు. 8.9 సెకెండ్ల వ్యవధిలోనే గరిష్ఠంగా 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. మిడ్ రేంజ్ వేరియంట్ బ్యాటరీ బ్యాకప్ 30 కేడబ్ల్యూహెచ్.

అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 325 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని సామర్థ్యం 127 బీహెచ్‌పీ. గరిష్ఠంగా 215 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంటీరియర్‌లో కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఫీచర్స్ ఉన్నాయి. 8- స్పీకర్ జేబీఎల్‌తో ఆడియో పని చేస్తుంది. ఊఫర్ అదనం. నెక్సాన్ ఈవీ మిడ్ రేంజ్ కారు ప్రైమ్ ధర 14.49 లక్షల రూపాయల నుంచి హైఎండ్‌లో రూ.17.19 లక్షలుగా ఉంది. లాంగ్ రేంజ్ కారు ధర రూ. 16.49 లక్షల రూపాయల వద్ద ప్రారంభం అవుతుంది. హైఎండ్ కారు రూ. ధర 19,54 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ధరలేనని కంపెనీ తెలిపింది.
ఈ కార్ మొత్తం మనకు ఏడు రంగుల్లో లభిస్తుంది. ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, పర్పుల్, ప్రిస్టైన్ వైట్, ఇంటెన్సిటీల్, క్రియేటివ్ ఓషన్ బ్లూ, డేటానో గ్రే కలర్స్ లో లభించనుంది..